వేణు స్వామి(Venu Swamy) పరిచయం అవసరం లేని పేరు.ఇటీవల కాలంలో ఈయన పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
ఒకవైపు సినిమా సెలబ్రిటీల గురించి మాట్లాడుతునే మరోవైపు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇక వేణు స్వామి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి పెద్ద ఎత్తున ప్రస్తావనకు తీసుకువస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు రాజకీయ పరంగా పెద్దగా సక్సెస్ లేదని ఆయన సినిమాలలో ఉంటేనే మంచి సక్సెస్ అవుతారని చెబుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాల గురించి కాకుండా వేణు స్వామి(Venu Swamy) ఆయన వ్యక్తిగత విషయం గురించి కూడా పలు సందర్భాలలో ప్రస్తావించారు.ముఖ్యంగా ఆయన పెళ్లిళ్లు, విడాకుల గురించి ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇదివరకే సంచలనంగా మారాయి.ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి (Pawan Kalyan Fourth Marriage) కూడా చేసుకోబోతారని గతంలో వేణు స్వామి తెలిపారు.

తాజాగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Venu Swamy)నాలుగో పెళ్లి గురించి మాట్లాడడమే కాకుండా ఆయన నాలుగో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి దూరంలో లేదని 2024 చివరిలోనే ఆయన నాలుగో పెళ్లి చేసుకుంటారంటూ ఈ సందర్భంగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో పవన్ అభిమానులు వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.ఇక పవన్ రాజకీయాల విషయానికి వస్తే ఈయన పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు మరికొన్ని గంటలలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి మరి రాజకీయపరంగా పవన్ ఈ ఎన్నికలలో విజయం సాధిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.