వైరల్ వీడియో: కత్తితో బెదిరించిన.. భయపడకుండా మొబైల్ దొంగను పోలీసులకు అప్పగించిన బాధితుడు..

ఈ మధ్యకాలంలో అనేకచోట్ల మొబైల్ దొంగతనాలు( Mobile Robbery ) ఎక్కువగా జరుగుతున్న సందర్భాలు ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉన్న ఇళ్లలో.

 Viral Video Youth Foils Cellphone Theft Thieves Arrested Details, Viral Video, S-TeluguStop.com

, అలాగే వారు నివసిస్తున్న ప్రాంతాలలో ఇలాంటి చోరీలు ఎక్కువ జరుగుతున్నాయి.ఇకపోతే తాజాగా హైదరాబాద్ లోని ( Hyderabad ) వెంగల్ రావు నగర్ లో ఉన్న జాషువా( Jashua ) అనే హాస్టల్ ఓనర్ తన హాస్టల్ సమీపంలో ఉండగా రామ్ సింగ్, బల్వీర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేయమని కోరుతూ అతని దగ్గరికి వచ్చారు.

అయితే వారు ఫోన్ చేయడానికి తన ఫోనుని వారి చేతికి ఇచ్చేశాడు.అయితే ఆ సమయంలో వారిద్దరు ఆ ఫోనుతో పారిపోవడానికి ప్రయత్నం చేశారు.

అయితే ఆ విషయాన్ని వెంటనే గ్రహించిన జాషువా వారు తప్పించుకోకుండా వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకున్నాడు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.ఈ సమయంలో దొంగలు జాషువాపై దాడి చేసి అలాగే కత్తితో బెదిరించారు కూడా.అయినా కానీ జాషువా వారిద్దరిని ధైర్యంగా ఎదుర్కొని అలాగే వారిని పట్టు వదలకుండా పట్టుకున్నాడు.

దీంతో వెంటనే అతడు మైంటైన్ చేస్తున్న హాస్టల్ విద్యార్థులు విషయాని గ్రహించి వెంటనే జాషువాకు సహాయం చేసి వారిని పట్టుకున్నారు.దాంతో వెంటనే జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపి దొంగలను వారికి అప్పగించారు.ఏది ఏమైనా ఇలాంటి ఆపద క్షణాల్లో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి.వీలైనంత వరకు అలర్ట్ గా ఉంటే చాలా మేలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube