సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి.అయితే కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి.
కొంతమంది స్టార్స్ తమ జీవితంలో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల చాలా పెద్ద డెసిషన్స్ తీసుకుంటారు.కొంతమంది తమ ప్రతాపం ఏంటో జనాలకు తెలియాలనుకుంటారు మరికొంతమంది తమకు నచ్చని పని జీవితంలో చేయకూడదు అనుకుంటారు.
అలా టాలీవుడ్ లో కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది సెలబ్రిటీస్ చాలా హర్ట్ అయ్యారు.దాని ద్వారా కొన్ని పెద్ద డెసిషన్ లు కూడా తీసుకున్నారు అవేంటో ఈ ఆర్టికల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఉదాహరణకు సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) నే తీసుకుందాం.మామూలుగా ఆయనకు ఈగో వైఫై లా ఆయన చుట్టే ఉంటుంది.తను కథలు రాసుకుని సినిమా డైరెక్షన్ చేయాలనుకోవడానికి ముందు నాని కోసం ఒక కథ రాసాడట.అయితే ప్రొడ్యూసర్ రెడీ గానే ఉన్నారని హీరోగా నానిని ( Nani )అనుకున్నాడట సందీప్.
అయితే నిర్మాతలకు కథ నచ్చింది కానీ నాని హీరోగా వద్దు అని చెప్పారట.దాంతో ఈగో హర్ట్ అయినా సందీప్ రెడ్డి వంగా ఈ రోజు వరకు ఆ కథ మళ్ళీ ఏ హీరోకి చెప్పలేదు.
ఇక రాంచరణ్( Ramcharan ) ఓసారి తన భార్య అయిన ఉపాసన( upasana ) కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చారట.కానీ తన తీసుకొచ్చిన గిఫ్ట్ ఉపాసనకు నచ్చలేదట దాంతో జీవితంలో ఆడపిల్లలకు తెలియకుండా వారు ఎలాంటి గిఫ్ట్స్ కొనద్దు అని తన ఈగో ఎంతలా హర్ట్ అయిందో ఒక స్టేజ్ పై తెలియజేయడం విశేషం.

సెట్ సెక్షన్ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కేరింత సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లారట అక్కడ టీం విజయ్ దేవరకొండ సెలెక్ట్ చేయకపోవడంతో తనేంటో వారికి నిరూపించుకోవాలని అనుకున్నారట.ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిపోయి అది బ్యానర్ లో ఫ్యామిలీ స్టార్ ( Family star )అనే సినిమా చేశాడు.ఈ సినిమా మాత్రమే కాదు తను తదుపరి సినిమా కూడా అదే బ్యానర్ లో రాబోతోంది.కేవలం ఆ బ్యానర్ మాత్రమే కాదు చాలామందికి తాను ఏంటో నిరూపించాలనుకున్నాడట ఆ టైంలో.
ఇలా వీరి ఈగోలు హర్ట్ అయి తామెంటో నిరూపించుకున్నారు.







