అమెరికాలో కనిపించకుండా పోయిన తెలుగు విద్యార్ధిని .. భయాందోళనలో పేరెంట్స్

ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల హత్యలు, అదృశ్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు.తాజాగా అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్ధిని అదృశ్యమైంది.

 23-year-old Indian Student Goes Missing In Us State Of California Details, Indi-TeluguStop.com

కాలిఫోర్నియాలో( California ) 23 ఏళ్ల విద్యార్ధిని గత వారం కనిపించకుండా పోయింది.ఆమె ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

శాన్‌బెర్నిర్డినో లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న నితీషా కందుల( Nitheesha Kandula ) మే28న అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

ఆమె చివరిసారిగా లాస్ ఏంజిల్స్‌లో( Los Angeles ) కనిపించినట్లుగా సీఎస్‌యూఎస్‌బీ పోలీస్ చీఫ్ ఆదివారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

నితీషా కందుల ఆచూకీపై ఎలాంటి సమాచారం తెలిసినా తక్షణం (909) 537-5165 నెంబర్‌లో సంప్రదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఆమె 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 160 పౌండ్లు (72.5 కిలోలు) బరువుతో నల్లటి జుట్టుతో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.బహుశా ఆమె కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్‌తో 2021 మోడల్ టయోటా కరోలాలో వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Telugu America, Calinia, Indian, Los Angeles, San Bernardino, Telugunitheesha, U

కాగా.గత నెలలో తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది( Rupesh Chandra Chintakindi ) అమెరికాలోని చికాగో నగరంలో కనిపించకుండా పోయాడు.మే 2 నుంచి ఆయన జాడ తెలియరావడం లేదని చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.రూపేశ్ ప్రస్తుతం చికాగోలోని విస్కాన్సిన్‌లో వున్న కాంకార్డియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

అతని ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం టచ్‌లో వున్నట్లు కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.రూపేశ్ జాడ త్వరలోనే తెలుస్తుందని.అతని గురించి ఎలాంటి సమాచారం వున్నా తమను సంప్రదించాల్సిదిగా పేర్కొంది.

Telugu America, Calinia, Indian, Los Angeles, San Bernardino, Telugunitheesha, U

అంతకుముందు ఏప్రిల్‌లో తెలంగాణకే చెందిన పాతికేళ్ల విద్యార్ధి కూడా క్లీవ్‌లాండ్ నగరంలో కనిపించకుండాపోయి శవమై కనిపించాడు.హైదరాబాద్ నాచారంకు చెందిన మహ్మద్ అబ్ధుల్ అర్ఫాత్ .( Mohammad Abdul Arfath ) క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గతేడాది మేలో అమెరికా వెళ్లాడు.మార్చి నెలలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ ( Amarnath Ghosh ) మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో కాల్చిచంపబడ్డాడు.అలాగే పర్డ్యూ యూనివర్సిటీలో 23 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్ధి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలో శవమై కనిపించాడు.

ఫిబ్రవరి 2న వివేక్ తనేజా (41) అనే భారతీయ సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్ వాషింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్ వెలుపల దాడికి గురయ్యాడు.జనవరిలో 18 ఏళ్ల అకుల్ ధావన్ అనే మరో విద్యార్ధి ఇల్లినాయిస్ యూనివర్సిటీ క్యాంపస్ వెలుపల అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మరణించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube