ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ( Hyderabad CP Kothakota Srinivas Reddy )కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ( Counting process) ప్రశాంతంగా కొనసాగే విధంగా పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్( Section 144 ) అమలు చేయాలని వెల్లడించారు.
చెప్పిన సమయానికి మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆయన సూచించారు.ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు నాయకులు సహకరించాలని తెలిపారు.
కాగా రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుందన్న సంగతి తెలిసిందే.