ఏపీలో పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ ( YCP )న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు చంద్రగిరి నియోజకవర్గంలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని పిటిషన్ దాఖలు చేసింది.
పోలింగ్ రోజు సుమారు నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయని వైసీపీ పార్టీకి చెందిన నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు( Chevireddy Mohith Reddy )లో మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.