ఏపీలో హోరాహోరీగా ఎన్నికల పోరు జరిగింది.ఎన్నికల పోలింగ్ తరువాత నుంచి రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ వరకు అందరి చూపు ‘ ఆరా మస్తాన్ ‘(Aura Mastan ) పైనే పడింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా సర్వే సంస్థల్లో విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ వస్తున్న సంస్థగా ‘ ఆరా ‘ కు మంచి గుర్తింపు ఉంది సంస్థను నడిపిస్తున్న వ్యక్తి పేరే మస్తాన్.ప్రతి ఎన్నికల సమయంలో ను ప్రీపోల్, పోస్ట్ పోల్(Prepoll, Post Poll) సర్వేలను మస్తాన్ ప్రకటిస్తున్నారు.
చాలా సందర్భాల్లో ఆరా మస్తాన్ ప్రకటించిన ఎగ్జైట్ పోల్స్ లో కచ్చితత్వం కనిపించడంతో, ఆయన పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్ ప్రకటించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత నిజంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఆరా మస్తాన్ క్రెడిబిలిటీ మరింతగా పెరిగింది.
తాజాగా ఏపీలో ఎన్నిక ల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ముందు నుంచే టిడిపి , వైసిపి , బీజేపీ, జనసేన )TDP, janasena,BJP, ysrcp)ఇలా అన్ని పార్టీలు ఆరం మస్తాన్ సర్వే నివేదిక పైనే టెన్షన్ పడ్డాయి. ఆ నివేదిక లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉంటే , ఆ పార్టీ కచ్చితంగా అధికారం చేపడుతుందనే నమ్మకం రాజకీయ పార్టీల్లోనూ, జనాల్లోనూ ఉండడంతో ఆరా మస్తాన్ సర్వే పై ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు, జనాలు ఆసక్తిగా ఎదురు చూసారు ఎన్నికల్లో 95 నుంచి 104 సీట్ల మధ్యలో వైసిపి సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో(AP politics) సంచలనంగా మారింది.
దీంతో ఆయన పేరు మరింతగా మీడియా , సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వైరల్ గా మారుతూనే ఉంది.దీంతో అసలు ఎవరు ఈ ఆరా మస్తాన్ అనే చర్చ మొదలైంది.
వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా సర్వే ప్రకటించడంతో, టీడీపీ(TDP) ఆ పార్టీ అనుకూల మీడియా ఆరా మస్తాన్ ను టార్గెట్ చేసుకున్నాయి.ఆయన జగన్ కు సన్నిహితుడని , జగన్(Jagan) తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా బయట పెట్టాడు. తన క్రేడిబిలిటీని కూడా పక్కనపెట్టి వైసీపీకి అధికారం ఖాయం అని ఉద్దేశపూర్వకంగా ఆరా మస్తాన్ ప్రకటించారని వైసీపీ వ్యతిరేక వర్గం అనేక ఆరోపణలు చేస్తోంది.గతంలో ఆయన శ్రీకాంత్ హీరోగా టెర్రర్ అనే సినిమా కూడా నిర్మించారని, మస్తాన్ ఎవరికో బినామీగా వ్యవహరిస్తున్నారని, అందుకే వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఉండబోతున్నాయి అని ప్రకటించారని వైసిపి వ్యతిరేక వర్గం మండిపడుతోంది.