పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి చేసిన జానీ డిజాస్టర్ కావడానికి కారణాలివేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినీ కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.అయితే ప్రేక్షకులను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసిన సినిమా ఏదనే ప్రశ్నకు మాత్రం జానీ సినిమా( Johnny Movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.

 Reasons Bheind Pawan Kalyan Johnny Disaster Movie Details, Pawan Kalyan, Johnny-TeluguStop.com

ఈ సినిమాలోని పాటలు హిట్టైనా సినిమా మాత్రం ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో భారీ షాకిచ్చింది.అయితే పవన్ ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని సమాచారం.

ఇతరుల సలహాలు తీసుకుని సినిమాను తీయడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఈ సినిమాకు మొదట అనుకున్న కథ ప్రకారం క్లైమాక్స్ లో హీరో చనిపోవాలి.

అయితే క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని కొంతమంది చెప్పడంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం మారిందట.పవన్ కళ్యాణ్ ఇతరుల సలహాలు తీసుకోకుండా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమా మరో స్థాయిలో ఉండి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ కెరీర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఓజీ,( OG ) హరిహర వీరమల్లు,( Hari Hara Veeramallu ) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా బిజీగా ఉండగా రెమ్యునరేషన్ పరంగా కూడా ఈ హీరో ఒకింత టాప్ లో ఉండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉందని సమాచారం అందుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడం ఖాయమని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడతారో లేక సినిమాలపై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube