టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde ) గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటివరకు టాలీవుడ్లో బాలీవుడ్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన పూజా హెగ్డే ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది.
అంతేకాకుండా చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించడం లేదు పూజా.తాజాగా చాలా రోజుల తర్వాత బయట కనిపించింది.
గత కొన్నాళ్లుగా చేసిన సినిమా చేసినట్లు ఫ్లాప్ కావడంతో ఛాన్సులు తగ్గిపోయాయి.

ప్రస్తుతం హిందీలో ఒక్క మూవీ చేస్తోంది.అలాంటిది ఇప్పుడు ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో( Cleaning Programme ) పాల్గొని తన వంతు బాధ్యత నిర్వర్తించింది.ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
దీంతో మరోసారి పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.తాజాగా ముంబయిలోని జుహూ బీచ్‌లో( Juhu Beach ) శనివారం నిర్వహించిన క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో పూజా పాల్గొంది.
చెత్త ఎత్తి పర్యావరణ పరిశుభ్రతలో భాగమైంది.సినిమాలు లేకపోవడం వల్ల ఇలా కాస్త ఖాళీగా ఉంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్‌లో కనిపిస్తోంది.బీచ్ లో అలా చాలా సింపుల్ గా చెత్త ఏరుతుండడంతో అది చూసి అభిమానులు ఆమె సింప్లిసిటీకి మెచ్చుకుంటున్నారు.పూజాపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా పూజా హెగ్డే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఇంత స్పీడుగా అయితే అవకాశాలను అందుకుందో అంటే స్పీడ్ గా అవకాశాలను కోల్పోతూ వచ్చింది.







