వైరల్ వీడియో: సొంతూరులో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరో..

షార్ట్ ఫిలిమ్స్( Short films ) లో నటించుకుంటూ చిన్నచిన్నగా మంచి పేరు తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు.అయితే మొదట్లో ఓ రెండు సినిమాలు మంచిగా విజయాలు సాధించిన ఆ తర్వాత అతనికి పెద్ద హిట్ రాకపోవడంతో ప్రస్తుతం ఆయన ఫామ్ లో లేడని చెప్పవచ్చు.

 Tollywood Hero Who Got Angry At Viral Video Home, Kiranabbavaram, His Village,-TeluguStop.com

కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన మీటర్, రూల్స్ రంజన్ సినిమాలో భారీ అపజయం పాలు కావడంతో ప్రస్తుతం కిరణ్ చేతుల్లో కొన్ని సినిమాలు ఉన్నా కానీ హిట్ కొట్టే ప్రయత్నంతో జాగ్రత్తగా ఆచితూచి సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి సినిమా హీరోయిన్ ను ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.అతి త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు.ఇకపోతే తాజాగా హీరో కిరణ్ అబ్బవరం మాస్ డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కిరణ్ అబ్బవరం తన సొంతూరు రాయచోటిలోని( Rayachoti ) పెద్ద కొడిమాండ్ల పల్లిలో జరిగిన ఆంజనేయస్వామి జాతరలో(Anjaneyaswamy fair ) పాల్గొన్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ముందుగా కిరణ్ ఈ జాతరలో పూజలు చేసి ఆ తర్వాత ఎడ్ల బండి తోలి గ్రామ కుర్రాళ్లతో కలిసి మాస్ డాన్స్ స్టెప్పులు వేసి అందరిని ఉత్సాహపరిచాడు.ఓ హీరో తన సొంతూరులో కుర్రాళ్ళతో డాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.హీరోగా ఇండస్ట్రీలో ఎంత ఎత్తు ఎదిగినా సొంతూరు వాళ్లతో డాన్సులు వేస్తున్నాడు అంటే అతడు సోషల్ మీడియాలో సినీ అభిమానులు అతన్ని తెగపొగిడేస్తున్నారు.

చాలామంది ఆశ్చర్యపోతున్నారు కూడా.కొన్నాళ్లు తన సినిమాలు ఆ సినిమా ప్రమోషన్ వల్ల వచ్చే ట్రోల్స్ వల్ల కిరణ్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా చేసిన మాస్ డాన్స్ స్టెప్పులతో మరింత వైరల్ గా గా మారాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube