మీకు దమ్ముంటే ముందు ఆ పని చేయండి.. చిన్మయి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ లేడీ సింగర్ చిన్మయి శ్రీపాద( Chinmayi Sripada ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 Singer Chinmayi Sripada About Trolls And Molestation Details, Singer Chinmayi, T-TeluguStop.com

ఎల్లప్పుడూ న్యాయం వైపు నిలబడుతూ న్యాయానికి మద్దతుగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది.చాలామంది ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆమెకు వ్యతిరేకంగా కూడా కామెంట్ లు చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు.

ఈమె దేశంలో జరిగే అత్యాచారాల మీద స్పందిస్తూనే ఉంటుంది.ఇలా చిన్మయి ఎప్పుడూ పోస్ట్‌లు వేస్తూనే ఉంటుంది.

వాటిపై ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.

Telugu Chinmayi, Tollywood, Trollers, Trolls-Movie

ఎంత ట్రోలింగ్( Trolling ) జరిగినా, ఎవరెన్ని రకాలుగా విమర్శించినా కూడా తాను చేసే పనుల్ని మాత్రం వదిలి పెట్టదు.అమ్మాయిల మీద జరిగే గృహ హింస, అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాల మీద ఎప్పుడూ గొంతు వినిపిస్తూనే ఉంటుంది.అలాంటి చిన్మయి తాజాగా ట్రోలర్లకు గట్టిగా కౌంటర్లు ఇచ్చింది.

దాని మీద ఎందుకు స్పందించలేదు.దీని మీద ఎందుకు స్పందించలేదు భయపడ్డావా? నీకు దమ్ముంటే స్పందించు గట్స్ ఉంటే స్పందించు అని రకరకాలుగా కామెంట్లు పెడతారు.కానీ అలా కామెంట్లు పెట్టే వాళ్లు మాత్రం సొంతంగా, సొంత పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసుకునే దమ్ము అయితే ఉండదు.

Telugu Chinmayi, Tollywood, Trollers, Trolls-Movie

ఫేక్ ఐడీలు,( Fake ID’s ) ఫేక్ పేర్లు, ఫోటోలతో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు.మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు.ముందు మీరు మీ మీ పేర్లతో ఒరిజినల్ అకౌంట్లు పెట్టుకోండి.

మీకు దమ్ముంటే ముందు ఆ పని చేయండి.ఆ తరువాత అడగండి.

ఆడవాళ్లు నవ్వితే ట్రోల్ చేస్తారు.వారేం చేసినా ట్రోలింగ్ చేస్తుంటారు.

సతీ సావిత్రి, పతివ్రతలు కాదంటూ ట్రోలింగ్ చేస్తుంటారు.ఆడవాళ్లు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి అని మగాళ్లు ఎందుకు చెబుతారు? వాళ్లు ఎందుకు అలా డిసైడ్ చేస్తుంటారు ఎంతో మంది ఆడవాళ్లు గృహ హింసను( Domestic Violence ) ఎదుర్కొంటూ ఉంటున్నారు అని కాస్త ఘాటుగా స్పందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube