రామ్ లిస్ట్ లో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు వీళ్లే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్…( Hero Ram ) ప్రస్తుతం రామ్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘డబుల్ ఇస్మార్ట్’( Double Ismart ) అనే సినిమా చేస్తున్నాడు.

 Ram Pothineni Planning New Movies With These Tollywood Top Directors Details, Ra-TeluguStop.com

ఈ సినిమాతో పాటుగా ఆయన తర్వాత చేయబోయే సినిమాల మీద కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Trivikram, Double Ismart, Harish Shankar, Ram Pothineni, Srinu Vaitla, To

ఇక ఇప్పటికే ఆయన లిస్టులో ముగ్గురు టాప్ డైరెక్టర్లు ఉన్నారు.మరి అందులో ఎవరికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది తెలియాల్సి ఉంది.అందులో మొదటగా మాటలు మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ ( Trivikram ) దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయాల్సి ఉంది.

 Ram Pothineni Planning New Movies With These Tollywood Top Directors Details, Ra-TeluguStop.com

అయితే వీళ్ళ ప్రాజెక్టు ఎప్పుడో పెట్టాలెక్కాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అనేది ఆగిపోయింది.అయితే రామ్ చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత ఈ సినిమా మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తో పాటుగా శ్రీనువైట్ల( Srinu Vaitla ) దర్శకత్వంలో రామ్ మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ ‘రెడీ ‘ అనే సినిమా చేశాడు.

Telugu Trivikram, Double Ismart, Harish Shankar, Ram Pothineni, Srinu Vaitla, To

అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.దాంతో వీళ్ళ కాంబినేషన్ పైన కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో కూడా సినిమా రాబోతుందనే వార్తలైతే వస్తున్నాయి.

వాళ్ళిద్దరితో పాటుగా రామ్ హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు.

దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేసి రామ్ తో చేయబోయే సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.చూడాలి మరి రామ్ వీళ్ళ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube