గెలిపించేది వాళ్లే ..  జగన్ ధీమా అందుకేనా ? 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.రెండోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని అధికార పీఠం పై కూర్చుంటాననే నమ్మకంతో ఉన్నారు.

 Is It Because Of Jagan Dhima That They Are The Ones Who Win , Jagan, Ysrcp, Tdp,-TeluguStop.com

టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి వచ్చినా తమ విజయాన్ని అడ్డుకోలేదని, కచ్చితంగా ప్రజలంతా తనవైపే ఉన్నారు అనే నమ్మకంతో జగన్ ఉన్నారు.గత ఐదేళ్ల పాలనలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, సంక్షేమ పథకాలన్నీ ఇంటి వద్దకే అందడం, మహిళల బ్యాంకు ఖాతాలో వివిధ పథకాల సొమ్ములు జమ కావడం ఇవన్నీ గతంలో ఎప్పుడూ ప్రజలు చూడలేదని, అందుకే తమకే పట్టం కడతారు అనే నమ్మకంతో జగన్ ఉన్నారు.

ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంక్ పై జగన్ చాలా ధీమాగా ఉన్నారు.కచ్చితంగా మహిళలంతా ఈసారి పూర్తిగా వైసిపి( YCP ) వైఫై ఉంటారని జగన్ అంచనా వేస్తున్నారు.2019లో అధికారంలోకి వచ్చిన జగన్, మహిళలను ఆకట్టుకునే విధంగానే వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించారు.అక్క చెల్లమ్మలు అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.

ఆకట్టు ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan Dhima Win, Jagan, Janasenani, Pavan Kalyan, Ysrcp-

ప్రతి పథకము తాలూకా సొమ్ములను వారి ఖాతాలోనే వేశారు.మహిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాలుగా జగన్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు.ఫీజు రియంబర్స్మెంట్( Reimbursement of Fees ) దగ్గర నుంచి అన్ని పథకాల సొమ్ములు మహిళల ఖాతాలోనే వేస్తున్నారు.

అమ్మ ఒడి, తల్లి దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలా ఏ పథకమైనా, మహిళల ఖాతాలోనే సొమ్ములు జమవుతూ వస్తున్నాయి.అలాగే 36 లక్షల మంది కి ఇళ్ల పట్టాలు ఇవ్వడం వంటివి మహిళలను బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Jagan Dhima Win, Jagan, Janasenani, Pavan Kalyan, Ysrcp-

దీంతో మహిళ ఓటర్లంతా వైసిపి వైపే ఉంటారు అనే ధీమా జగన్ లో కనిపిస్తోంది.మహిళ ఓటర్లు కష్టమైనా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తారని, అనుకున్న పార్టీకి ఓటు వేసేందుకు వారు ఏమాత్రం వెనకాడరు అని, ఎటువంటి ప్రలోభాలకు గురవరు అని జగన్ నమ్ముతున్నారు.మహిళా ఓటర్లు గెలుపోవటంలను నిర్ణయిస్తారు.ఓటర్ల వివరాలను ఇప్పటికే ఎన్నికల కమిషన్ వెల్లడించింది.మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నట్టుగా లెక్కలు తేల్చింది.దీంతో ఆ ఓటర్లే టార్గెట్  గా జగన్ అడుగులు వేస్తూ గెలుపు ధీమాను ప్రదర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube