కాలిఫోర్నియా హోమ్‌లెస్ పీపుల్ ఎక్కడ నివసిస్తున్నారో తెలిసి షాకైన పోలీసులు..

అమెరికా( America )లో ఇల్లు లేని ఎంతోమంది ప్రజలు రోడ్లపై బతుకుతూ కాలం వెళ్లదీస్తుంటారు.వారు కుప్పలు తెప్పలుగా రోడ్ల పక్కన చిన్న షెల్టర్స్ వేసుకొని ఆశ్రయం పొందుతున్నారు.

 Police Are Shocked To Know Where California S Homeless People Live, Homelessness-TeluguStop.com

యూఎస్‌లోని ప్రముఖ నగరమైన కాలిఫోర్నియాలో కూడా కొంతమందికి ఇల్లు లేదు.అయితే వారిలో కొందరు ఎవరూ ఊహించని చోట నివసిస్తూ పోలీసులకు షాకిచ్చారు.

వారు ఒక నది దగ్గర భూమిలో గుంతలు తవ్వి అక్కడ నివసిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. భూమిలో తవ్విన గుంతలు చాలా లోతుగా ఉన్నాయి, లోపల మెట్లు, వస్తువులు ఉన్నాయి.

ఆ ప్రదేశం మోడెస్టో( ModestoCalifornia ) అనే నగరానికి సమీపంలో ఉంది.

Telugu Calinia, Homeless, Homelessness, Modesto, Modestocalinia, Checkinh-Latest

పోలీసులు, కొందరు సహాయకులు వచ్చి గుంతల నుంచి ప్రజలను బయటకు తీశారు.ఆ స్థలంలో ఉన్న చాలా చెత్తను కూడా తీసుకెళ్లారు.గుంతలు సురక్షితంగా లేవని, నదికి వరదలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

గుంతల్లో నివసిస్తున్నందున అనేక సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు.

Telugu Calinia, Homeless, Homelessness, Modesto, Modestocalinia, Checkinh-Latest

ప్రజలు నివాసం ఉండేందుకు మెరుగైన స్థలాలను వెతకడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.వారు నిరాశ్రయులకు సహాయం చేసే కొన్ని గ్రూప్స్‌తో కలిసి పని చేస్తున్నారు.అయితే నిరాశ్రయులైన ప్రజలు నివసించే ప్రదేశం ఇది మాత్రమే కాదని వారు చెప్పారు.

కాలిఫోర్నియాలో ఇంకా చాలా ఉన్నాయి.కాలిఫోర్నియాలో అందరికీ సరిపడా ఇళ్లు లేవు.

ఇళ్లు కూడా చాలా ఖరీదైనవి.దీంతో ఎక్కువ మంది ప్రజలు వీధిన పడాల్సి వస్తోంది.

నాలుగు సంవత్సరాలలో నిరాశ్రయులైన ప్రజలకు సహాయం చేయడానికి కాలిఫోర్నియా( California) చాలా డబ్బు ఖర్చు చేసిందని మీడియా తెలిపింది.కానీ నిరాశ్రయుల సంఖ్య మాత్రం తగ్గలేదు.

వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది.అమెరికాలో వీధుల్లో నివసించే వారిలో సగం మంది కాలిఫోర్నియాలో ఉన్నారు.ఈ https://www.facebook.com/share/p/LP5kBBYSrtvdbYsP/?mibextid=I6gGtw పై క్లిక్ చేసి గుంతలలో కాలిఫోర్నియా ప్రజలు ఎలా నివసిస్తున్నారో చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube