బిర్యానీ ఆకులు( Biryani leaves ).వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.
వంటలకు చక్కని రుచి, ఫ్లేవర్ ను అందించడంలో ఈ ఆకుకు మరేదీ సాటి రాదు.అందుకే బిర్యానీ ఆకులను విరివిరిగా వాడుతుంటారు.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బిర్యానీ ఆకులో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ కూడా దాగి ఉన్నాయి.ముఖ్యంగా జుట్టు సంరక్షణకు ఈ ఆకులు ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.
హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారికి, హెయిర్ గ్రోత్ ( Hair growth )లేదని సతమతం అవుతున్న వారికి బిర్యానీ ఆకు ఉత్తమంగా హెల్ప్ వచ్చేస్తుంది.రెండు బిర్యానీ ఆకులను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.
మరి ఇంకెందుకు లేటు జుట్టుకు బిర్యానీ ఆకుల ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి.
వాటర్ బాగా హీట్ అయ్యాక అందులో రెండు బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరికాయ ముక్కలు( Dried amla slices ) కూడా వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ చల్లారే లోపు ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి.మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) కూడా వేసి కలుపుకోవాలి.తద్వారా ఒక మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.
ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించాలి.గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండుసార్లు ఈ హెయిర్ టానిక్ ను వాడారంటే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టుకు మంచి పోషణ అందుతుంది.జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.కురులు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతాయి.కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ టానిక్ ను ట్రై చేయండి.