చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచే న్యాచురల్ సీరం ఇది.. అస్సలు మిస్ అవ్వకండి!

చలికాలం( Winter ) వచ్చిందంటే చాలు చర్మం విపరీతంగా డ్రై అయిపోతూ ఉంటుంది.

ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్ ను వాడినప్పటికీ దాని ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.

మళ్ళీ చర్మం యధావిధిగా పొడిపొడిగా మారి చికాకు, దురదకు దారి తీస్తుంది.మీరు కూడా ఈ చలికాలంలో డ్రై స్కిన్( Dry Skin ) సమస్యతో బాగా విసుగు చెందుతున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరంను అస్సలు మిస్ అవ్వకండి.ఈ సీరం చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.

అదే సమయంలో మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ), వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు మరియు మెంతులు వేసుకుని పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత అందులో కొన్ని ఎండిన గులాబీ రేకులు ( Rose Petals )వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో థిక్ జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్‌లో రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ), రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ మరియు వ‌న్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) వేసి బాగా మిక్స్ చేయండి.

అవసరం అనుకుంటే మిక్సీ జార్ లో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి.తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.

ఈ సీరం ను బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

"""/" / నైట్ స్నానం చేసిన తర్వాత ఈ సీరం ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఇలా నిత్యం కనుక చేస్తే డ్రై స్కిన్ అన్నమాట అనరు.ఈ సీరం మీ చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతుంది.

గ్లోయింగ్ గా మెరుస్తుంది.అలాగే ఈ సీరంను వాడటం వల్ల చర్మంపై మొండి మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.

ముడతలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.మరియు స్కిన్ టైట్ గా బ్రైట్ గా సైతం మారుతుంది.

ఆంధ్రావాలా మూవీని తలదన్నేలా బాలయ్య మూవీ ఈవెంట్.. అన్ని లక్షల మంది వస్తారా?