ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది.ప్రతి రోజు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.
ఉదయం పది దాటిన తర్వాత బయటకు రావాలంటే భయమేస్తోంది.మరోవైపు తగ్గిందనుకున్న కరోనా భూతం కరోనా చాస్తోంది.
ఎండలను తట్టుకోలేక, కరోనా నుంచి రక్షించుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ రెండిటినీ అదిగమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పౌష్టికాహారం తీసుకోవాలి.
ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని కొన్ని సలాడ్స్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన సలాడ్స్‌లో ఫ్రూట్ సలాడ్ ఒకటి.దానమ్మి, మామిడి పండు, అరటి పండు, పుచ్చకాయ, కివి పండు, ద్రాక్ష పళ్లు, యాపిల్ వంటి వాటితో తయారు చేసుకున్న సలాడ్‌ను తరచూ తీసుకుంటే.
వేసవి వేడి నుంచి తప్పుంచుకోవచ్చు.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము.శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.దాంతో వైరస్‌ల బారిన పడకుండా ఉంటాము.

మొలకలు సలాడ్ (స్ప్రౌ ట్స్ సలాడ్) ను కూడా ఈ సమ్మర్ సీజన్‌లో తీసుకుంటే చాలా మంచిది.శెనగలు, మినిములు, అలసందలు, పెసలు, బొబ్బర్లు వంటి వాటితో మొలకలు తయారు చేసుకుని.ఆ తర్వాత సలాడ్ చేసుకోవాలి.న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే మొలకల సలాడ్ తీసుకుంటే.బరువును అదుపులో ఉంచుకోవచ్చు.ఎండల ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

ఇక ఆకుకూరల సలాడ్ కూడా సమ్మర్‌లో తీసుకుంటే చాలా మంచిది.పాలకూర, క్యాబేజీ, తోటకూర, కాలీఫ్లవర్, బ్రొకోలీ వంటి వాటితో సలార్ చేసుకుని తీసుకుంటే.వేసవిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే నీరసం, అలసట వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
మలబద్ధకం దూరం అవుతుంది.గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
కంటి చూపు కూడా పెరుగుతుంది.