తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు.ఈయన ఏ పాత్ర చేస్తున్న అందులో నటించారు జీవిస్తారు.
ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా శర్వానంద్ నటనకు లీనమైపోతారు.ఈయన చేసిన జాను సినిమాలో కూడా శర్వానంద్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి.
ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది.
వీరిద్దరూ ఆ పాత్రలను 100 శాతం న్యాయం చేశారనే చెప్పాలి.
ఈ సినిమాలో శర్వానంద్ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా నటించాడు.ఈ సినిమా నుండి వచ్చిన లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పటి వరకు ఈ పాటను 100 మిలియన్స్ కు పైగా వీక్షించారు.ఈ పాటకు సిరి వెన్నెల సీతా రామశాస్త్రి సాహిత్యం అందించారు.

గోవింద్ వసంత్ అందించిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ పాటకు సింగర్ ప్రదీప్ కుమార్ తన గొంతుతో ప్రాణం పోసాడనే చెప్పాలి.జాను సినిమాను ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా నుండి వచ్చిన లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కాబట్టే 100 మిలియన్ మార్క్ ను టచ్ చేసింది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం శర్వానంద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం శర్వానంద్ విజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.మహా సముద్రం సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు శర్వానంద్ ‘ఆడవార్లు మీకు జోహార్లు’ సినిమా చేస్తున్నాడు.
ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.