మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు “మీకు బాగా నచ్చిన దర్శకులు? మిమ్మల్ని పైకి తీసుకువచ్చిన దర్శకులు ఎవరు?” అనే ఓ ప్రశ్న ఎదురయ్యింది.దీనికి సదరు హీరో చాలామంది పేర్లను చెప్పాడు.
కానీ అసలైన కోదండరామిరెడ్డి( Director Kodandaramireddy ) పేరును మాత్రం చెప్పలేదు.వాస్తవానికి, చిరంజీవి మెగాస్టార్‌గా( Megastar ) తీర్చిదిద్దడంలో కోదండరామిరెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడు.
ఖైదీ, ఛాలెంజ్, విజేత, రాక్షసుడు, పసివాడి ప్రాణం, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, ముఠామేస్త్రి, కొండవీటి దొంగ వంటి ఎన్నో హిట్స్ చిరంజీవికి అందించి అతడిని ఒక తిరుగులేని హీరోగా నిలబెట్టాడు కోదండరామిరెడ్డి.

కానీ చిరంజీవి తనని పైకి తీసుకువచ్చిన దర్శకులలో అతని పేరుని చెప్పకపోవడం అవమానంగా ఉందని తాజాగా కోదండరామిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ వాపోయాడు.“ఎవరేమనుకున్నా సరే, చిరంజీవి నా గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం వల్ల నేను చాలా బాడ్ గా ఫీల్ అయ్యాను.అతనితో కలిసి నేను 23 సినిమాలు తీశాను.
అవన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.అయినా నా పేరు అతను ప్రస్తావించకపోవడం చాలా బ్యాడ్ గా అనిపించింది.” అని కోదండరామిరెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెబుతూ అసహనం వ్యక్తం చేశాడు.

ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.లైఫ్ ఇచ్చిన వ్యక్తిని అవమానించడం చిరంజీవికి తగినది కాదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.వారి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? అతని పేరు ఇతను ఎందుకు ప్రస్తావించలేదని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కోదండరామిరెడ్డి చివరిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా పున్నమినాగు.( Punnaminagu ) 2009లో రిలీజ్ అయిన ఈ మూవీలో ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించింది.ఆ సినిమా అవుడేటేడ్ కథతో రావడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.అంతకుముందు ఈ డైరెక్టర్ తీసిన ఒకటో నెంబర్ కుర్రాడు, గొడవ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
కోదండరామిరెడ్డి గత 22 ఏళ్లలో తీసింది ఐదే సినిమాలు కాగా వాటిలో ఒకటి కూడా హిట్ కావకపోవడం గమనార్హం.