పారిస్ ఒలింపిక్స్‌లో( Paris Olympics ) గోల్డ్ మెడల్‌ని గెలుచుకున్న డచ్ స్విమ్మర్ షారన్ వాన్ రౌవెండాల్( Sharon Van Rouwendaal ) ఎవరు ఊహించని ఒక పని చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఆమె తన ఎంతో కష్టపడి గెలుచుకున్న గోల్డ్ మెడల్‌ని( Gold Medal ) తన కుక్కకు అంకితం చేసింది.
స్వర్ణ పతకాన్ని కుక్కకు డెడికేట్ చేయడం వెనుక చాలా ఎమోషనల్ కథ ఉంది.ఈమె ఇంతకుముందు పోమరేనియన్ జాతికి చెందిన ఓ కుక్కను( Dog ) పెంచుకుంది.
దాని పేరు రియో. షారన్ బ్రెజిల్‌లోని రియోలో గెలిచిన ఒలింపిక్స్ మెడల్‌కు గుర్తుగా కుక్కకు ఆ పేరు పెట్టింది.
కానీ దురదృష్టవశాత్తు, ఈ ఏడాది మే నెలలో రియో చనిపోయింది.
షారాన్‌కు ఈ విషయం చాలా బాధ కలిగించింది.
తన కుక్క లేకుండా తను ఏమీ చేయలేనని అనుకుంది.మూడు వారాలు పాటు ఈత కూడా కొట్టలేదు.
కానీ ఆ తర్వాత ఆమె తండ్రి, “నీ కుక్క కోసం నువ్వు ఈ పోటీలో పాల్గొనాలి” అని చెప్పాడు.దీంతో షారన్ తన కుక్క కోసం ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.

షారన్ వాన్ రౌవెండాల్ చెప్పిన మాటలు చాలా మందిని కదిలించాయి.ఆమె చెప్పిన ఎమోషనల్ మాటలు విన్న తర్వాత, చాలా మంది కామెంట్ సెక్షన్‌లో భావోద్వేగమైన కామెంట్లు చేశారు.“నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నా! నా కుక్కల ఇమేజ్‌ను నా శరీరం మీద టాటూ వేయించుకున్నా.అవి నన్ను ఎల్లప్పుడూ ముందుకు సాగేలా ప్రోత్సహిస్తాయి.” అని అన్నారు.“ఇప్పుడు రియో( Rio ) కుక్కల స్వర్గంలో అత్యంత సంతోషంగా ఉంటుంది.” అని మరొకరు కామెంట్ చేశారు.ఈ పోస్ట్ చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని మరికొంతమంది అన్నారు.

డచ్ క్రీడాకారిణి షారన్ ఒలింపిక్స్‌లో పది కిలోమీటర్ల ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది.ఈ పోటీలో ఆమె 2 గంటలు 3 నిమిషాలు 34 సెకన్లలో ఈత కొట్టి లక్ష్యాన్ని చేరుకుంది.







