స్టడీస్‌ను అందుకే సీరియస్‌గా తీసుకోదట.. ఈ చిన్నారి ఏం చెబుతుందో వింటే..?

సాధారణంగా పిల్లలను చదివించడం చాలా కష్టం.చిన్న పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడరు.

 Student Funny Answer When Teacher Says You Are Not Serious About Studies Viral V-TeluguStop.com

ఎందుకు చదవాలి? అని ఎదురు ప్రశ్నిస్తారు.దీని వల్ల తల్లిదండ్రులు చాలా బాధపడతారు.అయితే ఇటీవల ఒక స్టూడెంట్( Student ) నువ్వు ఎందుకు స్టడీస్ ను సీరియస్‌గా చూసుకోవట్లేదు అని టీచర్( Teacher ) తిడితే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.“ఎందుకు చదవట్లేదని అడుగుతున్నావా అయితే చెప్తా విను” అంటూ ఆ చిన్నారి చాలా పెద్ద ఆన్సర్ చెప్పింది.సోషల్ మీడియాలో ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది ఈ ఆన్సర్ కి వినటం వల్ల టీచర్‌ అవాక్కయింది.అనంతరం ఈ స్టూడెంట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మన బాలిక చెప్పిన సమాధానం విని అందరు తెగ నవ్వేసుకుంటున్నారు.

ఈ లిటిల్ స్టూడెంట్ ప్రపంచం ఎంత పెద్దదో, అందులో మనం ఎంత అల్పజీవులమో వివరించడం మొదలుపెట్టింది.“ఈ భూమికి ( Earth ) 450 కోట్ల ఏళ్లు, మనుషులకు 370 కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది.మనం చూస్తున్న ఈ విశ్వంలాంటి విశ్వాలు ఎన్ని ఉన్నాయో, అందులో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో తెలియద”ని చెప్పుకొచ్చింది.తన వివరణను నక్షత్రాలు, సూర్యుడు, భూమి, దేశాలు అంటూ కొనసాగించింది.“మనం 10 లక్షల జీవరాశుల్లో ఒకటి అని, భారతదేశంలో( India ) 160 కోట్ల మంది ఉన్నారు.చివరగా, “నేను నన్ను ఎంత సీరియస్‌గా తీసుకోవాలి? నా ఉనికి వల్ల ఈ ప్రపంచానికి ఏం జరుగుతుంది?” అని ప్రశ్నించింది.దాంతో టీచర్ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది.

చిన్నవాళ్లం కాబట్టి చదువు పట్ల అంత ఎక్కువ ఒత్తిడి పెట్టుకోనక్కరలేదని తనదైన శైలిలో ఈ స్టూడెంట్ వివరించిన విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి, “ఆ చిన్నారి సమాధానం విన్న తర్వాత నా మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది” అని ట్వీట్ చేశారు.ఇదే విధంగా చాలా మంది నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు.“ఆ అమ్మాయి టీచర్‌ని కూడా ఆలోచింపజేసింది.” అని ఒకరు “ఓ మై గాడ్! నా మనసుకు చాలా ఆశ్చర్యం కలిగింది.” అని మరొకరు “ఆమె చెప్పింది నిజమే.” ఇంకొకరు కామెంట్ చేశారు.ఇప్పటికే ఈ వీడియోను 8 లక్షలకు పైగా మంది చూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube