స్టడీస్‌ను అందుకే సీరియస్‌గా తీసుకోదట.. ఈ చిన్నారి ఏం చెబుతుందో వింటే..?

సాధారణంగా పిల్లలను చదివించడం చాలా కష్టం.చిన్న పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడరు.

ఎందుకు చదవాలి? అని ఎదురు ప్రశ్నిస్తారు.దీని వల్ల తల్లిదండ్రులు చాలా బాధపడతారు.

అయితే ఇటీవల ఒక స్టూడెంట్( Student ) నువ్వు ఎందుకు స్టడీస్ ను సీరియస్‌గా చూసుకోవట్లేదు అని టీచర్( Teacher ) తిడితే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

"ఎందుకు చదవట్లేదని అడుగుతున్నావా అయితే చెప్తా విను" అంటూ ఆ చిన్నారి చాలా పెద్ద ఆన్సర్ చెప్పింది.

సోషల్ మీడియాలో ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది ఈ ఆన్సర్ కి వినటం వల్ల టీచర్‌ అవాక్కయింది.

అనంతరం ఈ స్టూడెంట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.మన బాలిక చెప్పిన సమాధానం విని అందరు తెగ నవ్వేసుకుంటున్నారు.

"""/" / ఈ లిటిల్ స్టూడెంట్ ప్రపంచం ఎంత పెద్దదో, అందులో మనం ఎంత అల్పజీవులమో వివరించడం మొదలుపెట్టింది.

"ఈ భూమికి ( Earth ) 450 కోట్ల ఏళ్లు, మనుషులకు 370 కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది.

మనం చూస్తున్న ఈ విశ్వంలాంటి విశ్వాలు ఎన్ని ఉన్నాయో, అందులో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో తెలియద"ని చెప్పుకొచ్చింది.

తన వివరణను నక్షత్రాలు, సూర్యుడు, భూమి, దేశాలు అంటూ కొనసాగించింది."మనం 10 లక్షల జీవరాశుల్లో ఒకటి అని, భారతదేశంలో( India ) 160 కోట్ల మంది ఉన్నారు.

చివరగా, "నేను నన్ను ఎంత సీరియస్‌గా తీసుకోవాలి? నా ఉనికి వల్ల ఈ ప్రపంచానికి ఏం జరుగుతుంది?" అని ప్రశ్నించింది.

దాంతో టీచర్ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది. """/" / చిన్నవాళ్లం కాబట్టి చదువు పట్ల అంత ఎక్కువ ఒత్తిడి పెట్టుకోనక్కరలేదని తనదైన శైలిలో ఈ స్టూడెంట్ వివరించిన విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి, "ఆ చిన్నారి సమాధానం విన్న తర్వాత నా మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది" అని ట్వీట్ చేశారు.

ఇదే విధంగా చాలా మంది నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు."ఆ అమ్మాయి టీచర్‌ని కూడా ఆలోచింపజేసింది.

" అని ఒకరు "ఓ మై గాడ్! నా మనసుకు చాలా ఆశ్చర్యం కలిగింది.

" అని మరొకరు "ఆమె చెప్పింది నిజమే." ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇప్పటికే ఈ వీడియోను 8 లక్షలకు పైగా మంది చూశారు.

మరి ఇంత కామాంధులేంట్రా మీరు.. లేడీస్ వాష్‌రూమ్‌ డస్ట్‌బిన్‌లో మొబైల్ లో వీడియో రికార్డ్..