వైరమత్తు-ఒక షాంపూ బాటిల్ కహాని మీకు తెలుసా?

తమిళ లిరిక్ రైటర్ వైరముత్తు( Vairamuthu ) గురించి మన తెలుగు వాళ్లకి కూడా తెలుసు.ఆ గొప్పతనం రైటర్ వైరముత్తుది ఎంత మాత్రం కాదు, ఆ భాగ్యం సింగర్ చిన్మయికి చెందుతుంది.

 Vairamuthu Shampoo Bottle Story , Vairamuthu , Social Media, Suchitra, Casting-TeluguStop.com

ఆమె తమిళ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ప్రముఖంగా, ఈ మహానుభావుడు గురించే చెప్పుకుంటూ వచ్చేది.ఈ క్రమంలోనే మన ఇరు తెలుగు రాష్ట్రాల వారికి, ఈయన రాస లీలలు గురించి తెలిసే అవకాశం చిక్కింది.

Telugu Chinmayi, Kollywood, Shampoobottle, Suchitra, Vairamuthu-Movie

ఈ నేపథ్యంలోనే, వైరముత్తు – ఒక షాంపూ బాటిల్ కథ బయటికి పొక్కింది.ఆ కథ మామూలు కథ కాదండోయ్? ఆ కథతో ఇంకో సినిమా తీసేయొచ్చు.సింగర్ చిన్మయి కూడా ఆయన బాధితురాలే.ఆయన కొట్టిన దెబ్బకి సింగర్ చిన్మయి ( Chinmayi )తమిళంలో అవకాశాలను కోల్పోయిందని చెబుతూ ఉంటారు.ఇదే కోవకు చెందుతుంది సింగర్ సుచిత్ర.ఈ షాంపూ బాటిల్ కథ సుచిత్ర చెప్పుకొచ్చినదే.

Telugu Chinmayi, Kollywood, Shampoobottle, Suchitra, Vairamuthu-Movie

ఓ మీడియా వేదికగా సుచిత్ర మాట్లాడుతూ, రైటర్ వైరముత్తుతో ఆమెకి గల చేదు అనుభవాన్ని చెప్పు కొచ్చింది.ఓ సందర్భంలో వైరముత్తు ఆమెకి ఫోన్ చేసి, “ఎంతో అద్భుతంగా పాడారు.నేను రాసినప్పుడు కూడా ఆ అద్భుతాన్ని ఫీల్ అవ్వలేదు.మీ పాటతో నేను ప్రేమలో పడిపోయాను.నీకు కచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందే.ఒకసారి ఇంటికి రండి!” అని చెప్పి వైరముత్తు ఫోన్ పెట్టేసాడట!కట్ చేస్తే… వైరముత్తు ఇంటికి సింగర్ సుచిత్ర తన అమ్మమ్మతో కలిసి వెళ్లిందట! సుచిత్ర అమ్మమ్మను చూసిన వైరముత్తు షాక్ అయ్యాడట! దాంతో కాస్త తేరుకొని… క్యాజువల్ గా మాట్లాడడం మొదలుపెట్టాడట.

అలా చాలాసేపు మాట్లాడేసరికి, విషయం అర్థమైన సుచిత్ర అమ్మమ్మ, నా మనవరాలకి ఏదో గిఫ్టు ఇస్తానన్నారట! అందుకే ఇక్కడికి వచ్చాము.చెప్పడంతో ఏం చేయాలో తెలియని వైరముత్తు, లోపలికి వెళ్లి ఒక షాంపూ బాటిల్ తీసుకొచ్చి వారి చేతిలో పెట్టాడట! ఈ విషయం చెప్పుకొని సుచిత్ర ఒక రేంజ్ లో నవ్వులు నవ్వింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube