దర్శకుడు శంకర్( Shankar Shanmugam ) గురించి పరిచయం అవసరం లేదు! ఇప్పుడంటే అందరూ తెలుగు దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు కానీ, దాదాపు 15 ఏళ్ల క్రితం చూసుకుంటే.ఇండియా వైడ్ ఒకే ఒక్క దర్శకుడి ప్రతిభ గురించి మాట్లాడుకునేవారు… ఆయనే దర్శకుడు శంకర్.1990ల సమయంలోనే ఒక సినిమాకి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసే సత్తాగలిగిన వ్యక్తి ఆయనే.ఆ భాషలకి తగ్గట్టుగా నటీనటుల్ని కూడా మార్చి సినిమాలు తీసేవారు ఈ విజనరీ డైరెక్టర్.
అలాగే తన విజన్ కి హాలీవుడ్ సినిమా దర్శకులు సైతం అప్పట్లో ఆశ్చర్య పోయేవారు అని వినికిడి.అలాంటి శంకర్ ఇప్పుడు ఫామ్ లో లేరు కానీ తాను హిట్ కొడితే ఎలా ఉంటుందో అని చూడడానికి సినిమా ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తున్నారు!
కానీ, ఎందుకో ఆయన సినిమాలు గత 15 ఏళ్లలో ఆడిన దాఖలాలు మనకి కనబడవు.అంటే సుమారుగా రజనీకాంత్ తో తీసిన రోబో 1 సినిమా( Robo ) తరువాత ఆయన సినిమాలు పట్టు తప్పినట్టు కనబడుతున్నాయి.దాదాపు 14 ఏళ్ల క్రితం, సరిగ్గా 2010లో రిలీజ్ అయినా ఈ సినిమా సునామీ సృష్టించింది.
ఆ తరువాత ఆ స్థాయిలో ఆయన సినిమాలు ఆడలేదనే చెప్పుకోవాలి.దాంతో ఆయన సినిమాలు ఎందుకు ఆడడం లేదు అనే విషయంలో చాలామంది మదన పడగా ఒకే ఒక్క విషయం గురించి, చాలామంది మాట్లాడుతున్నారు.అదేమంటే… ఆయన పాత రైటర్ గురించి.
అప్పట్లో ఆయన సినిమాలకు ఆ రైటర్ పని చేయడం వల్లనే బాగా హెల్ప్ అయ్యేది.ఎప్పుడైతే రైటర్ “సుజాత( Sujatha )” చనిపోయారో అప్పటినుండి శంకర్ తన సినిమాలలో మార్క్ లోపించిందని గుసగుసలు వినబడుతున్నాయి.రైటర్ సుజాతకి, దర్శకుడు శంకర్ కి చాలా అవినాభావ సంబంధం ఉండేదట.
శంకర్ ఆలోచనలు తగ్గట్టుగా సుజాత రాసేవారట.కానీ నేటి తరం శంకర్ ఆలోచనను అందుకోవడంలో తికమక పడుతున్నారని వినికిడి.
ఇదే విషయాన్ని తమిళ సైట్స్ కూడా చెబుతున్నాయి.ఆమధ్య భారతీయుడు 2 సినిమా ప్రమోషన్లో భాగంగా శంకర్ ని ఇదే విషయం పై సదరు విలేఖరి ప్రశ్న వేసినపుడు శంక ఏదో కవర్ చేస్తూ మాట్లాడారు కానీ, ఆయన మనసులో ఏముందో అది ఆయన కళ్ళల్లో వ్యక్తం అయింది! కాబట్టి సుజాత లాంటి రైటర్ ఆయనకి దొరకాలని ఆశిద్దాము.