మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గత 40 సంవత్సరాలు నుంచి ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోయే సినిమాలు కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే ఉంది.ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనను ఇంకొక మెట్టు పైకెక్కించే విధంగా ఉండబోతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో ఒక పాల సంస్థను ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ ఫిలిం అయితే చేశారు.అయితే ఈ యాడ్ ఫిలింలో చిరంజీవి కనబరిచిన యాక్టింగ్ గాని ఆయన లుక్కు గాని చాలా అద్భుతంగా ఉండడంతో చాలామంది చిరంజీవి అభిమానులు సైతం వీళ్ళ కాంబోలో సినిమా కోసం అసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఇక దాంతో హరీశ్ శంకర్ చిరంజీవిని అద్భుతంగా చూపించడమే కాకుండా ఆయనలోని హ్యూమర్ టచ్ ను కూడా మరోసారి బయటకు తీశాడు.
అలాగే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక రీసెంట్ గా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం హరిష్ శంకర్ వర్కింగ్ స్టైల్ నచ్చి తనకు సినిమా ఆఫర్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు.కానీ వీళ్ళ కాంబోలో కనక సినిమా వర్కౌట్ అయితే మంచి కమర్షియల్ సినిమాని తీయడానికి హరీష్ శంకర్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి వీళ్ళు సినిమా చేస్తే ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…
.