మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు సెంటిమెంట్లు ఎక్కువగా నమ్ముతారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ముఖ్యంగా న్యూమరాలజీని కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
పేర్లు మార్చుకోవడం, స్పెల్లింగ్ సరిదిద్దడం, న్యూమరాలజీ ప్రకారం వాహనానికి నెంబర్ ని తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.అలా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పేర్లు కూడా మార్చుకున్న విషయం తెలిసిందే.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన పేరు రెండు మూడుసార్లు మార్చాడు.సాయితేజ్, దర్గతేజ్ ఇలా మారుతూ వెళ్లింది.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో హీరో కూడా తన పేరులో మార్పులు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఆ హీరో మరెవరో కాదు సందీప్ కిషన్.హీరో సందీప్ తన పేరులో చిన్న మార్పు చేశారట.అంటే సందీప్ కిషన్ (sandeep kishan)పేరు కాస్త సందీప్ కిణ్ష్ గా మార్చుకున్నారట.
అంతేకాకుండా పీపుల్స్ స్టార్ అనే బిరుదును కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.తన కొత్త సినిమా పోస్టర్ మజాకా సినిమాలో కూడా పీపుల్స్ స్టార్ గా తనని పరిచయం చేసుకోబోతున్నాడు సందీప్ కిషన్.
అయితే ఇదేం కొత్త బిరుదు కాదు.అభ్యుదయ చిత్రాలు తీసే ఆర్.
నారాయణ మూర్తిని(R.Narayana Murthy) అందరూ పీపుల్స్ స్టార్ అని పిలుచుకొంటారు.
ప్రజల కోసం, వాళ్ల సమస్యల కోసం సినిమాలు తీస్తాడు కాబట్టి, ఆయనకు ఆ బిరుదు పెట్టడంలో న్యాయం ఉంది.అయితే సందీప్ కిషన్ పీపుల్స్ స్టార్ ఎలా అయ్యాడో మరి.
ప్రతీ హీరోకీ ఏదో ఒక ట్యాగ్ ఉండాలి కాబట్టి తాను పీపుల్స్ స్టార్ అయిపోయాడేమో? అంటూ చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.బిరుదులు, పేర్ల సంగతి అటుంచితే సందీప్ టాలెంటెడ్.ఈ విషయంలో సందేహం లేదు.జయాపజయాలతో సంబంధం లేకుండా తన కెరీర్ సాగుతోంది.చాలా ఆశలు పెట్టుకొన్న మైఖెల్ తనని బాగా నిరాశ పరిచింది.ఆ తర్వాత విడుదలైన ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona) సినిమాతో కాస్త ఉపశమనం లభించింది.
ఇప్పుడు మజాకా సినిమాపై చాలా ఆశలే పెట్టుకొన్నాడు.త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల అవుతోంది.