సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కొడుకు కూతురు.. అలా లక్ పరీక్షించుకుంటున్నారా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Raviteja Childrens Enter Into Film Industry, Raviteja, Children, Film Industry,-TeluguStop.com

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు రవితేజ.అందులో భాగంగానే ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమా( Mr Bachchan )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ నీ తెచ్చుకుంది.దీంతో అభిమానులు రవితేజ పై మండిపడిన విషయం తెలిసిందే.

కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు.రవితేజ తదుపరి సినిమాతో ఎలా అయినా మంచి సక్సెస్ సాధించాలని ఫుల్ కసిగా ఉన్నారు.

Telugu Bachchan, Raviteja, Sandeepreddy, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో రవితేజ ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే హీరో రవితేజ పిల్లలు ఇద్దరూ సినిమా రంగంలోకి వచ్చేసారట.కాగా రవితేజ‌కు ఇద్దరు పిల్లలు.ఒక కుమార్తె, ఒక కొడుకు ఇద్దరూ సినిమా రంగాన్నే తమ కెరీర్ కోసం ఎంచుకున్నారు.కుమార్తె నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారట.తండ్రి బ్యానర్ అర్ టీ టీమ్ వర్క్స్ కాకుండా వేరే బ్యానర్ పెట్టబోతున్నారు.

అంతకన్నా ముందుగా సితార సంస్థ నాగవంశీతో కలిసి ఒకటి రెండు చిన్న ప్రాజెక్ట్ లు చేయబోతున్నారు.ప్రస్తుతానికి సితార సంస్థలో నిర్మాణ మెళకువలు నేర్చుకుంటున్నారు.

అయితే ఇక్కడ గమ్మత్తేమిటంటే హీరో రవితేజ ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా వుంటారు.

Telugu Bachchan, Raviteja, Sandeepreddy, Tollywood-Movie

రూపాయి నష్టపోయే పనిలోకి దిగరు.పెట్టుబడులు అంతా రియల్ ఎస్టేట్ లోనే.అలాంటిది కుమార్తె మాత్రం డబ్బు రిస్క్ వున్న నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

ఈ విషయంలో రవితేజకు పెద్దగా ఇష్టం లేకపోయినా, కూతురు పంతం ముందు ఊ అనక తప్పలేదు.ప్రస్తుతం ఒక సినిమాను శ్రీవిష్ణు హీరోగా చేసే పనిలో వున్నారు.

రవితేజ కుమారుడు ప్రస్తుతానికి డైరక్షన్ ఫీల్డ్ ను ఎంచుకున్నారు.అతగాడికి సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) అంటే చాలా ఇష్టం.

అందుకే మొత్తానికి ఎవరితో ఒకరితో రికమెండ్ చేయించుకుని సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ గా చేరిపోయారు.భవిష్యత్ లో డైరక్టర్ గా సెటిల్ అవుతారో, హీరోగా మారతారో చూడాలి మరి.రవితేజ కూడా ముందుగా అసిస్టెంట్ డైరక్టర్ గా చాన్నాళ్లు చేసి, అప్పుడు హీరోగా మారారు.బహుశా కొడుకు కూడా అదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube