బిగ్ బాస్( Bigg Boss 8 )తెలుగు సీజన్ 8 కార్యక్రమం మూడు వారాలను పూర్తిచేసుకుని నాలుగవ వారంలోకి అడుగుపెట్టింది.14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇక మూడవ వారంలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి అభయ్ నవీన్ (Abhay Naveen) ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన ఎలిమినేట్ కావడంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.ఈయన ఓటింగ్ పరంగా వెనకంజలో ఉండడమే కాకుండా హౌస్ లో బిగ్ బాస్ ను తిడుతూ మాట్లాడటంతో నాగార్జున( Nagarjuna ) సైతం ఈయనకు తనదైన స్టైల్ లోనే క్లాస్ పీకారు అంతేకాకుండా రెడ్ కార్డు కూడా ఇచ్చేశారు.బిగ్ బాస్ పెళ్ళాంతో గొడవపడి మనకు టాస్కులు ఇస్తున్నారు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు.ఇక బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభయ్ నవీన్ అసలు బిగ్ బాస్ ని ఎందుకు తిట్టాల్సి వచ్చిందనే విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ హౌస్లో ఉంటే తినడానికి ఫుడ్ సరిగా దొరకదని తెలిపారు.అప్పటికే మూడు రోజుల పాటు తిండి లేకుండా ఉన్నాము.ఆ సమయంలోనే రేషన్ వచ్చింది. రేషన్ వచ్చింది కదా అని సంతోష పడేలోపు టైమర్ కూడా ఇచ్చారు.ఎలాంటి కండిషన్స్ లేకుండా ఉంటే ఒకరే అయినా పదిమందికి వంట చేసి పెట్టొచ్చు కానీ కండిషన్స్ ఉంటే ముగ్గురైన ఆరుగురికి వంట చేయలేరని క్లారిటీ ఇచ్చారు.అంతేకాకుండా రేపటి కోసం కూడా ముందు రోజే ఫుడ్ తయారు చేసి పెట్టుకోవాలి.
ఇలా ముందు రోజే తయారు చేసుకున్న ఫుడ్ తినటం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుందని ముఖ్యంగా ఆదిత్య ఓం చాలా ఇబ్బంది పడుతున్నారని అభయ్ నవీన్ వెల్లడించారు.అందుకే తాను బిగ్ బాస్ ను తిట్టానని మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు మందు రాసుకోవడం కంటే గాయం తగలకుండా చూసుకోవడమే మంచిది కదా నేను కూడా అదే పాలసీ ఫాలో అవుతాను అందుకే తిట్టాను అంటూ ఈ సందర్భంగా అభయ్ నవీన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
.