తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు వైవిధ్యమైనటువంటి నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇక ఇప్పటికే వాళ్ల డామినేషన్ ఎక్కువైపోయింది అనుకున్న సమయంలో తెలుగు సినిమాల్లో కూడా విలన్స్ గా వాళ్లే నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
అలాగే మన దర్శకుడు కూడా వాళ్లతోనే నటింప చేయడానికి ఇష్టపడుతున్నారు.కారణమేంటంటే వాళ్లు సినిమాల్లో గనక చేస్తే వాళ్ల నటన గానీ వాళ్లు పలికించే హవాభావాలు గానీ చాలా జెన్యూన్ గా ఉంటాయి.

అందువల్లే వాళ్లతో సినిమాలు చేయడానికి చాలామంది మన తెలుగు దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.రీసెంట్ గా ఎస్ జే సూర్య( SJ Surya ) ‘సరిపోదా శనివారం ‘ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించాడు.ఇక ఆయనకి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.అలాగే సముద్ర ఖని, విజయ్ సేతుపతి ( Samuthirakani )లాంటి నటులు తెలుగులో భారీ రేంజ్ లో ఆఫర్లను దక్కించుకుంటూ తెలుగు నటులను సైతం డామినేట్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి మన నటులు ఎందుకు వెనుకబడిపోతున్నారనే విషయంలోనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఇక కొద్ది రోజుల వరకు విలన్ గా నటించి మెప్పించిన జగపతిబాబు సైతం ఇప్పుడు వెనుకబడి పోతున్నాడు.కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఆయనకు తగ్గ పాత్రలు కూడా మన దర్శకుడు క్రియేట్ చేయడం లేదు.ఒకవేళ చేసిన కూడా అందులో అతన్ని కాకుండా తమిళ్ నటులను తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అంటూ తెలుగు సినిమా పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…చూడాలి మరి మన తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించే నటులు ఎలాంటి అవకాశాలను దక్కించుకుంటారు అనేది…
.