ఉమ్మివేయడమే అతడు చేసిన తప్పు.. మర్డర్ కేసులో దొరికిపోయాడుగా...

నేరస్తులు ఒక దారుణం చేసిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.పోలీసులకు అనుమానం రాకుండా ఆధారాలన్నీ రిమూవ్ చేస్తారు కానీ చిన్నచిన్న క్లూస్ మాత్రం వదిలేస్తారు.

 The Mistake He Made Was Spitting And He Was Caught In The Murder Case, Dna Evide-TeluguStop.com

అవే వారిని పట్టిస్తాయని అసలు ఊహించలేరు.కొందరు నేరం చేసిన తర్వాత కూడా పట్టుబడకుండా ఉంటారు కానీ ఒక్కోసారి పోలీసులకు పట్టుబడేలా వారికి క్లూస్‌ ఇస్తుంటారు.

తాజాగా బోస్టన్‌కు( Boston ) చెందిన ఒక వ్యక్తి కూడా అలాంటి క్లూ వదిలేశాడు.చివరికి అదే అతన్ని పట్టించింది.

వివరాల్లోకి వెళ్తే 30 ఏళ్ల క్రితం ఒక హత్య జరిగింది.ఎట్టకేలకు ఈ కేసులో 65 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ వ్యక్తి తన ఇంటి ముందు ఉమ్మి వేశాడు, అతని లాలాజలం నుంచి తీసిన డీఎన్ఏ ఆధారంగా పోలీసులు 1988లో జరిగిన ఒక మహిళ హత్య కేసులో అతనిని అనుమానించారు.1988లో, పోలీసులు ఆ మహిళ శవానికి దగ్గరలో జేమ్స్ హోలోమాన్ ( James Holloman )అనే వ్యక్తి పేరుతో ఉన్న ఒక చెక్కును కనుగొన్నారు.కానీ ఆ సమయంలో ఆయనను ఆ హత్య కేసుతో ముడిపెట్టలేకపోయారు.ఎందుకంటే సరైన ఎవిడెన్స్ దొరకలేదు.అతనిపై మాత్రం పోలీసులకు అనుమానం ఉంది.ఎలాగైనా తమ డౌట్ క్లియర్ చేసుకున్నావ్ అనుకున్నారు.

Telugu Dna Evidence, Saliva Sample, Unsolved-Telugu NRI

గత సంవత్సరం, హోలోమాన్ అనే వ్యక్తి తన ఇంటి ముందు రోడ్డుపై ఉమ్మి వేసాడు.పోలీసులు ఆయన ఉమ్మును సేకరించి, దాని నుంచి డీఎన్ఏ పరీక్షలు చేశారు.ఈ డిఎన్ఏ, 30 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో మృతురాలి గోళ్ల కింద, స్వెట్‌షర్టు మీద, సిగరెట్ మీద దొరికిన డిఎన్ఏతో మ్యాచ్ అయింది.అంతే ఇంకేముంది బోస్టన్ పోలీసులు సెప్టెంబర్ 19న హోలోమాన్‌ను అరెస్టు చేశారు.

అతనికి ఇంతకు ముందు ఏ క్రిమినల్ రికార్డు లేదు.అతను అక్టోబర్ 29న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.

Telugu Dna Evidence, Saliva Sample, Unsolved-Telugu NRI

హోలోమాన్‌ వకీలు డీఎన్ఏ సాక్ష్యంపై సందేహాలు వ్యక్తం చేశారు.ఇంత కాలం తర్వాత ఈ డీఎన్ఏ పరీక్షలు యాక్యురేట్‌గా ఉంటాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.సఫోక్ కౌంటీ జిల్లా అటార్నీ కెవిన్ హేడెన్, ఈ కేసును విచారించిన పోలీసులు, ప్రాసిక్యూటర్ల కృషిని అభినందించారు.చాలా కాలంగా పరిష్కారం కాని ఈ హత్య కేసును ఆధునిక శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఛేదించగలిగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.”కానీ అత్యంత ముఖ్యంగా, ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసిన కరెన్ టేలర్ కుటుంబానికి న్యాయం జరిగింది,” అని ఆయన అన్నారు.ఇకపోతే 1988 మే 27న, 25 ఏళ్ల కరెన్ టేలర్ అనే మహిళ బోస్టన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై తేలింది.

ఆమెకు 3 ఏళ్ల కూతురు కూడా ఉంది.ఆ చిన్నారి తన అమ్మమ్మతో, “అమ్మ నిద్రపోయి లేవలేదు” అని చెప్పింది.కరెన్ తల్లి కిటికీ ద్వారా లోపలికి వెళ్లి చూసేసరికి తన కూతురు రక్తపు మడుగులో పడి ఉంది.పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, కరెన్‌ను ఛాతీ, తల, మెడ భాగాల్లో 15 సార్లు కత్తితో పొడిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube