కల్కి సినిమాపై గరికపాటి కౌంటర్లు.. ప్రభాస్ అభిమానుల రియాక్షన్ వైరల్!

టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి.ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ను సాధించిన విషయం తెలిసిందే.

 Garikapati Counters Prabhas Fans Reaction On Kalki Movie Is Viral, Garikapati Co-TeluguStop.com

మహాభారతం(Mahabharata) బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు మూవీ మేకర్స్.ఇకపోతే తాజాగా ఈ సినిమాపై గరికపాటి (Garikapati)స్పందిస్తూ కౌంటర్లు వేశారు.

ఈ మేరకు ఆయన స్పందిస్తూ.ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తే రచయిత ఏదైనా రాస్తాడని, సినిమా వాళ్ళు ఏది చూపిస్తే అదే నిజమైపోతుందని, అశ్వద్ధామ కర్ణుడు హీరోలైపోగా మిగిలినవాళ్ళు విలన్ లా అంటూ ప్రశ్న రేకెత్తించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

Telugu Garika Pati, Jagadekaveerudu, Kalki, Sr Ntr, Tollywood-Movie

అయితే హీరోలు, సినిమాల మీద ఆయన విమర్శలు చేయడం కొత్తేమి కాదు కానీ ఒక ధార్మిక ప్రవచనంలో కల్కి 2898 ( Kalki)ఏడి గురించి ప్రస్తావించడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.ఈ మేరకు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే నిజానికి కల్కి 2898 ఏడి నిజంగా జరిగిన కథని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కడ చెప్పలేదు.భారతాన్ని తీసుకుని కాల్పనికత జోడించడం ఎప్పటి నుంచో వుంది.

అలనాటి మేటి క్లాసిక్ మాయాబజార్(Mayabazaar) లో చూపించిన కొన్ని ఘటనలు ఇతిహాసంలో లేవు.ఎస్వి కృష్ణారెడ్డి(SV Krishna Reddy) తీసిన ఘటోత్ఘచుడు సినిమాలో కూడా దీనికి సంబంధించిన ఫాంటసీ టచ్ ఉంటుంది.

జగదేకవీరుడు అతిలోకసుందరిలో(Jagadeka Veerudu Athiloka Sundari ) ఇంద్రుడి కూతురు ఇంద్రజ భూమి మీదకు వచ్చినట్టు చూపించారు.

Telugu Garika Pati, Jagadekaveerudu, Kalki, Sr Ntr, Tollywood-Movie

అది నిజం కాదే.యమగోలలో ఎన్టీఆర్ ఏకంగా దేవేంద్రుడికి క్లాస్ తీసుకోవడం ఏ పురాణాల్లో చదవలేదే.ఇదంతా క్రియేటివ్ ఫ్రీడమ్ కిందకు వస్తుంది.

వీటి వల్ల మనోభావాలు దెబ్బ తినడం లాంటివి జరగలేదు.తప్పని ఎవరూ వేలెత్తి చూపలేదు.

కల్కి కూడా ఆ కోవలోకే వస్తుంది.దుర్యోధన, కర్ణ స్నేహాన్ని హైలైట్ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ (Sr.

NTR )దానవీరశూరకర్ణ ఇండస్ట్రీ హిట్ అయితే ఉన్నదున్నట్టు తీసిన కృష్ణ కురుక్షేత్రం(Krishna Kurukshetra) ఆడలేదు.రెండూ ఒకే కథలే.

ప్రేక్షకులు దేన్ని అంగీకరిస్తారు దేన్ని తిరస్కరిస్తారనే దాన్ని బట్టి హిట్టు ఫ్లాపు ఆధారపడి ఉంటుంది.కల్కి వేయి కోట్లు ఊరికే వసూలు చేయలేదుగా.

హిందీ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లోనూ అంగీకారం దక్కింది కాబట్టే బ్లాక్ బస్టర్ నమోదయ్యింది.కానీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రభాస్ అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube