ఈ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్లు వేగంగా క‌రుగుతాయి.. తెలుసా?

If You Drink This Juice, The Kidney Stones Will Dissolve Fast , Kidney Stones, Banana Stem Juice, Banana Stem, Banana Stem Benefits, Kidneys, Kidney Health, Health, Health Tips, Good Health, Latest News

కిడ్నీ స్టోన్స్ లేదా మూత్ర‌పిండాల్లో రాళ్లు.పెద్ద‌ల‌నే కాదు పిల్ల‌ల‌ను సైతం వేధించే స‌ర్వ‌సాధార‌ణ‌మైన ఆరోగ్య స‌మ‌స్య ఇది.

 If You Drink This Juice, The Kidney Stones Will Dissolve Fast , Kidney Stones, B-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించ‌క‌పోవ‌డం, ఊబకాయం, యూరినరీ ట్రాక్ట్ అంటువ్యాధులకు గురికావ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మూత్ర‌పిండాల్లో స్ఫటికాకార రాళ్లు ఏర్ప‌డ‌తాయి.కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు వ‌స్తుంటాయి.

ఈ రాళ్లు చిన్న పరిమాణంలో ఉంటే మూత్రం ద్వారా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

కానీ, పెద్దగా ఉంటే మాత్రం మూత్ర‌విస‌ర్జ‌న స‌మ‌యంలో తీవ్ర‌మైన నొప్పి, త‌ర‌చూ జ్వ‌రం రావ‌డం, అధిక చ‌లి, న‌డుము నొప్పి, తరచుగా మూత్రవిసర్జన చేయాలని అనిపించడం, మూత్రంలో ర‌క్త‌స్రావం వంటి ర‌క‌ర‌కాల స‌మస్య‌లు ఎదుర‌వుతాయి.

అందుకే కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించుకునేందుకు మందులు వాడ‌తారు, ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను మీ డైట్‌లో చేర్చుకోవాలి.ఇంత‌కీ ఆ జ్యూస్ మ‌రేంటో కాదు బనానా స్టెమ్(అరటి దూట) జ్యూస్‌.

ఈ జ్యూస్ మూత్ర‌పిండాల్లోని రాళ్ల‌ను చాలా వేగంగా కరిగిస్తుంది.పైగా ఈ జ్యూస్‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమి కాదు.

Telugu Banana Stem, Bananastem, Tips, Kidney, Kidneys, Latest-Telugu Health Tips

చిన్న అర‌టి దూటను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అర‌టి దూట ముక్క‌ల‌ను మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాట‌ర్, కొద్దిగా రాక్ సాల్ట్ కూడా మిక్సీ జార్ లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకుని తాగేయ‌డ‌మే.

రోజుకు ఒక గ్లాస్ ఈ బనానా స్టెమ్ జ్యూస్ ను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్ర‌మంగా క‌రిగిపోతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube