స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ “నా పేరు సూర్య (2018)( Naa Peru Surya, Naa Illu India ),” ఆశించినంత హిట్ సాధించలేదు.దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.
ముఖ్యంగా అల్లు అర్జున్ ను చాలా మంది టార్గెట్ చేశారు.అతను ఆర్మీ జవాన్ గా సరిగా నటించలేకపోయాడని క్రిటిసైజ్ చేశారు.
అంతే కాదు అదే సమయంలో ఒక విషయం కూడా వెలుగులోకి వచ్చింది.అదేంటంటే ఈ యాక్షన్ సినిమా కోసం బన్నీ యూఎస్ ఆర్మీ దగ్గర ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడట.
వక్కంతం వంశీ( Vakkantham Vams ) ఈ సినిమా స్టోరీ చెప్పగానే వెంటనే ఎగ్జైట్ అయిపోయి ఆర్మీ జవాన్ లాగా తయారు కావాలని బన్నీ అనుకున్నాడట.
ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ జవాన్ గా తయారు కావాలనుకున్నాడు.అదే సమయంలో మోస్ట్ పవర్‌ఫుల్ ఆర్మీ ఏది అని సెర్చ్ చేస్తే అతనికి యూఎస్ ఆర్మీ గురించి తెలిసిందట.అందుకే అమెరికాకి వెళ్లి మరీ ఆ దేశ ఆర్మీ వద్ద ట్రైనింగ్ తీసుకుంటూ ఆరు నెలలు కష్టపడ్డాడు.
ఈ విషయం బయటికి రావడంతో “అసలైన ఆర్మీ అంటే మన ఇండియన్ ఆర్మీ నే, ఇక్కడ పవర్ ఫుల్ ఇండియన్ జవాన్లను ఉంచుకొని నువ్వు అమెరికాకి వెళ్లి ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి?” అని బన్నీని ఏకిపారేశారు.ఈ సినిమా బిస్కెట్ కావడంతో అల్లు అర్జున్ హాఫ్ ఇయర్ పడిన కష్టం వృధా అయిపోయింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ యాంగర్ ఇష్యూస్‌తో చాలా సఫర్ అవుతుంటాడు.ఒక సైనికుడిగా సరిహద్దుల్లో సేవ చేయాలనే కల కూడా ఉంటుంది.
దాన్ని నెరవేర్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతాడు.అయితే చెత్త స్టోరీ, వరస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్, ఇంకా అనవసరమైన సన్నివేశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి అది ఫెయిల్ అయింది.
మరొకవైపు ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ (2019)( Uri: The Surgical Strike ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విక్కీ కౌశల్.ఈ బాలీవుడ్ హీరో అల్లు అర్జున్ లాగా విదేశాలకు వెళ్లి ఆర్మీ ట్రైనింగ్ తీసుకోలేదు.
మన ఇండియన్స్ దగ్గరే ఆరు నెలలు పాటు కష్టపడి మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు.భారత సైనికుల లాగా బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు.వారి లాంటి ఫిట్నెస్ కూడా సాధించాడు.
ఈ మిలిటరీ యాక్షన్ ఫిల్మ్‌కు ఆదిత్య ధర్ దర్శకుడు( Aditya Dhar ).2016 ఉరి దాడికి ప్రతీకారంగా జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఇందులో విక్కీ కౌశల్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో ఉరి మూవీ ప్రత్యేకంగా నిలుస్తుంది.ముఖ్యంగా విక్కీ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ బాగా హైలైట్ అయింది.
ఆర్మీ పాత్రలో ఎవరూ కూడా విక్కీ లాగా నటించలేదు.అల్లు అర్జున్ భవిష్యత్తులో సైనికుడి పాత్రను అద్భుతంగా పోషించి తనపై పడిన మచ్చ చెరిపేసుకోవచ్చు.