తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR ).ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నప్పటికీ దేవర సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకోవడంలో చాలా వరకు ముందు వరుసలో ఉన్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఇలాంటి సందర్భంలోనే దేవర సినిమా( Devara movie ) మీద భారీగా నెగిటివ్ టాకైతే వస్తుంది.ఇక ఇప్పటికే దేవర సినిమా (Devara movie )రివ్యూ అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియా( Social media )లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏ మాత్రం తన ప్రతిభను చూపించలేదని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా మీద తీసుకున్న కేర్ అయితే ఏం కనిపించడం లేదని దీనికోసం మూడు సంవత్సరాలు ఎందుకు వృధా చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఒరిజినల్ టాక్ అయితే బయటకు రాదు.ఇక కావాలనే కొంతమంది ఇలాంటి న్యూస్ ను కూడా స్ప్రెడ్ చేస్తున్నారంటు ఎన్టీఆర్ అభిమానులు చాలావరకు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల శివ ఇద్దరు భారీ సక్సెస్ లను సాధిస్తారని చాలామంది అనుకుంటున్నారు.
ఇక ఎన్టీఆర్ ఇప్పటికే భారీ సక్సెస్ లను సాధించి ఉన్నాడు.కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారని పలువురు సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి వాళ్ళు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది…
.