ఈ వారం థియేటర్లలో, ఓటీటీలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలే విడుదలవుతున్నాయి.అయితే ఈ వారం విడుదలవుతున్న భారీ బడ్జెట్ మూవీ దేవర( Devara ) కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెండు రోల్స్ లో నటించారు.
ఈ వారం రిలీజవుతున్న మరో క్రేజీ మూవీ సత్యం సుందరం( Sathyam Sundaram ) కాగా కార్తీ ( Karthi )కెరీర్ లో ఈ సినిమా హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.ఈ వారం రిలీజవుతున్న రెండు పెద్ద సినిమాలు ఇవే కాగా ఓటీటీల విషయానికి వస్తే సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించడం గమనార్హం.థియేటర్లలో హిట్టైన ఈ మూవీ ఓటీటీలలో సైతం హిట్ అవుతుందేమో చూడాలి.
డిమోంటీ కాలనీ2 సినిమా సైతం ఈ నెల 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.జీ5 ఓటీటీలో లవ్ సితార హిందీ వెర్షన్ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుండగా నెట్ ఫ్లిక్స్ లో పెనెలోప్ వెబ్ సిరీస్ రేపటి నుంచి హెవెన్ అండ్ హెల్ ఇంగ్లీష్ సిరీస్ సెప్టెంబర్ 26 నుంచి, ది ట్రూ జెంటిల్ మేన్ ఇంగ్లీష్ సిరీస్ సెప్టెంబర్ 26 నుంచి ప్రసారం కానున్నాయి.సెప్టెంబర్ 27న రెజ్ బాల్ హాలీవుడ్ సిరీస్ తో పాటు విల్ అండ్ హార్పర్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వాళ మలయాళం వెర్షన్ సెప్టెంబర్ 23 నుంచి ప్రసారం కానుండగా 9 – 1 – 1 వెబ్ సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
గ్రోటీ స్క్వేర్ హాలీవుడ్ సిరీస్ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా తాజా ఖబర్2 వెబ్ సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.