తెలంగాణలో టీడీపీ అనేది ఉందా అనే ప్రశ్నకు నమ్మకంగా సమాధానమిచ్చే పరిస్థితి లేదు.ఎందుకంటే తెలంగాణ బిల్లు సమయంలో తెలంగాణ బిల్లును ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన చంద్రబాబు పట్ల ప్రజలు ఆగ్రహించి పార్టీని ఘోరంగా ఓటమి పాలు చేశారు.
సమన్యాయం పాటించాలని బిల్లు సమయంలో చెప్పాము తప్ప తెలంగాణ ఇవ్వవద్దనీ మేమెక్కడా చెప్పిన సందర్భం లేదని తరువాత సమర్థించుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగియిపోయింది.టీడీపీలో ఉన్న కీలక నేతలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీశారు.
ఇక కొంత మందికి మంత్రి పదవులు, కొంత మందికి పార్టీ పదవులు ఇవ్వడంతోనె తెలంగాణ టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసే నేతలు కరువయ్యారు.అయితే ఏపీలో కూడా టీడీపీ పరిస్థితి అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో తెలంగాణ టీడీపీపై చంద్రబాబు దృష్టి సారిచినట్లు తెలుస్తోంది.
కొత్త కొత్త పార్టీలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్న సమయంలో తిరిగి టీడీపీకి పునర్వైభవం తేవాలని టీడీపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారట చంద్రబాబు.అయితే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు కారణమేమంటే షర్మిల తెలంగాణలో కూడా కీలక పాత్ర పోషిస్తే, ఇక టీడీపీ పార్టీని ఇక ప్రజలు మరింతగా మర్చిపోయే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇక టీడీపీ గురించి ప్రజలకు వివరించినా ప్రజలు వినే పరిస్థితిలో ఉండరని ఈ వ్యూహానికి తెరదీసినట్టు సమాచారం.







