నవంబర్ 26 ఏ భారత దేశపౌరుడు కూడా తమ జీవితంలో మర్చిపోలేని ఈ చీకటి రోజున ఎంతోమంది సైనికులు దేశం కోసం విరోచితంగా పోరాడి భరతమాతకు తమ ప్రాణాలను అర్పించిన రోజు.26/11 ముంబైలో టెర్రరిస్టులు ఎంతోమంది అమాయక ప్రజలపై కాల్పులు జరపగా వారితో సైనికులు పోరాడి ఎంతోమంది ప్రజలను కాపాడుతూ వారి ప్రాణాలను పణంగా పెట్టారు.ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఈ ఘటన ఇప్పటికీ భారతీయుల కళ్ళ ముందు కదులుతూనే ఉంది.
ఈ విధంగా 26న దేశం కోసం పోరాడి మరణించిన వీర సైనికులను మరోసారి భారతీయులు తలుచుకొని వారికి నివాళులు అర్పించారు.
ఇలా భరతమాత కోసం ప్రాణాలు విడిచిన వారిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు.ముంబై దాడులలో భాగంగా టెర్రరిస్టులతో జరిపిన పోరాటంలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి టాలీవుడ్ నటుడు అడివి శేష్ సందీప్ తల్లిదండ్రులతో కలిసి వీర సైనికుల స్మారక చిహ్నాన్ని సందర్శించి వారికి ఘన నివాళులు అర్పించారు.

మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఆధారంగా మేజర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాలో సందీప్ పాత్రలో అడివి శేష్ ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి మేజర్ సందీప్ భరతమాతకు చేసిన సేవలను అందరికీ తెలియజేశారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎంతోమంది ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది.
ఈ క్రమంలోనే అడివి శేష్ సందీప్ తల్లిదండ్రులతో పాటు మేజర్ సందీప్ కు ఘన నివాళులు అర్పించారు.







