రికార్డులు బ్రేక్‌ చేస్తున్న కేజీఎఫ్‌2 టీజర్ లోని ఆ షాట్ పై ట్రోల్స్‌ మీమ్స్‌

కన్నడ రాకింగ్ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా టీజర్ నేడు విడుదల అయ్యింది.యశ్‌ పుట్టిన రోజు సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్ కు అద్బుత రెస్పాన్స్‌ వచ్చింది.24 గంటల లోపులోనే 60 మిలియన్ ల వ్యూస్‌ ను క్రాస్‌ చేసింది.ఇక మూడు మిలియన్‌ లకు పైగా లైక్స్‌ ను దక్కించుకున్న ఈ టీజర్‌ అద్బుతం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా అంటున్నారు.

 Kgf 2 Teaser Trolls And Meems, Rocky Bhai, Hero Yesh, Kgf Movie, Sanjay Dutt, Ra-TeluguStop.com

అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఈ టీజర్ కు ఫిదా అయ్యి సినిమా ఎప్పుడు బాసూ అంటూ ప్రశ్నిస్తున్నారు.ఒక హీరో కు పుట్టిన రోజు కానుక ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు ఊహించరు.

అద్బుతమైన పుట్టిన రోజు కానుక ను దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఇచ్చాడు.ఇక టీజర్‌ కు అద్బుత రెస్పాన్స్ రావడంతో పాటు కొందరు దీనిలోని ఒక షాట్ ను మీమ్స్ చేస్తున్నారు.

Telugu Kgfteaser, Kgf, Kgf Trolls, Prashanth Neel, Telugu, Yash-Movie

హీరో యశ్‌ ఒక భారీ గన్‌ ను పేల్చడంతో దాని ముందు ఎర్రగా కాల్చిన రాడ్డు మాదిరిగా అవుతుంది.దానికి యశ్‌ తన సిగరెట్‌ ను వెలిగించుకున్నాడు.ఇది మరీ ఓవర్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సిగరెట్‌ మాత్రమేనా మొక్క జొన్న కండెలు కూడా కాల్చుకోవచ్చా అంటూ కొందరు.ఈ చలి కాలం కొద్ది సమయం అక్కడ చలి కాచుకుంటే బాగుండు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఆ షాట్ ను రచ్చ రచ్చ గా ట్రెండ్‌ చేస్తున్నారు.

వరుసగా కేజీఎఫ్‌ నుండి వస్తున్న పోస్టర్‌ లు మరియు టీజర్ తో సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నాం అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అని బాహుబలి కాచుకో అంటూ కొందరు చెబుతున్నారు.

బాహుబలి లో ప్రభాస్‌ బాణంతో అద్బుతాలు సృష్టిస్తే ఈ సినిమాలో యశ్‌ గన్‌ తో సిగర్ వెలిగించుకోవడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube