మంగళగిరి 6వ బెటాలియన్ లో జరిగిన పోలీసు జాగిలాల పరేడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హోంనంత్రి తానేటి వనిత 20 వ బ్యాచ్ కు చెందిన డాగ్ స్క్వాడ్ విన్యాసాలు పరేడ్ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్త, ఇంటెలిజెన్స్ డీజీ సీతా రామాంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఐజి లు, ఎస్పీ లు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఉత్తమ ప్రదర్శన కనబరిచిన డాగ్ స్క్వాడ్ టీం లకు హోంమంత్రి తానేటి వనిత అవార్డ్ లను అందించారు.
తానేటి వనిత , హోంమంత్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్న వివిధ విభాగాలతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నది.నేర విచారణలో, నేరస్తుల జాడ పసిగట్టడం, విఐపి ల భద్రత విషయంలో మరియు ఆగంతకులపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకునే ప్రక్రియలో పోలీస్ జాగిలాల పాత్ర ఎంతో ముఖ్యమైనది.
జాగిలాలకు చక్కటి శిక్షణ ఇచ్చి, విధులకు సన్నద్ధం చేసిన అధికారులను అభినందిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 177 పోలీసు జాగిలాల ఆరోగ్య అవసరాల నిమిత్తము ఒక వెటర్నరీ డాక్టర్ పోస్టును మంజూరు చేయడం జరిగింది.
సీఎం జగన్ పోలీస్ శాఖ పూర్తి పారదర్శకంగా, సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.సీఎం జగన్ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్న మన రాష్ట్ర పోలీస్ శాఖ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
ఇప్పటి వరకు దాదాపు 189 జాతీయ అవార్డులు మన రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకోవడం ఎంతో సంతోషకరం.సీఎం జగన్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దిశ ను తీసుకొచ్చారు.
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ను కూడా ప్రవేశ పెట్టడం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా కోటి 30 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు.
దిశ యాప్ ను ఉపయోగించి ఆపదలో ఉన్న అనేక మంది మహిళలు రక్షణ పొందిన దాఖలాలు అనేకం ఉన్నాయి.అదేవిధంగా సైబర్ మిత్ర, వుమన్ హెల్ప్ డెస్క్, గ్రామ మహిళా పోలీసుల సేవలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
మన రాష్ట్ర పోలీస్ శాఖ అనుసరిస్తున్న విధి విధానాలను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయి.ఈ ఘనత అంతా మన సీఎం జగన్ కే దక్కుతుంది.
అదేవిధంగా ఈ 8 నెలల కాలంలో ఒక మామూలు జాగిలాన్ని పోలీసు జాగిలంగా తీర్చిదిద్ది సమాజ సేవకు వాటిని అంకితం చేసిన ప్రతి ఒక్క అధికారిని అభినందిస్తున్నాను.ఈ జాగిలాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మన రాష్ట్ర పోలీసు శాఖ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.