జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‎కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‎కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.

 Zaheerabad Mp Bibi Patil Will Be Sued In The Supreme Court-TeluguStop.com

గతంలో తెలంగాణ హైకోర్టులో వేసిన కేసును పున పరిశీలన చేయాలని తెలిపింది.అదేవిధంగా ఆరు నెలలో విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

టీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనపై ఉన్న నేరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కావున సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ మదన్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే, అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు కేసును కొట్టివేయడంతో ఆయన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.కేసును వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube