జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‎కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‎కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.

గతంలో తెలంగాణ హైకోర్టులో వేసిన కేసును పున పరిశీలన చేయాలని తెలిపింది.అదేవిధంగా ఆరు నెలలో విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

టీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనపై ఉన్న నేరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కావున సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ మదన్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే, అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు కేసును కొట్టివేయడంతో ఆయన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.కేసును వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…