కొంపముంచిన కిస్ క్యామ్.. బాయ్ ఫ్రెండ్‌కి అడ్డంగా దొరికిన ఆ యువతి..!

ఏవైనా స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల వైపు కెమెరా తిరిగినప్పుడు వారు సాధారణంగా సంతోష పడతారు.అయితే కొద్ది రోజులుగా పక్కన ఉన్న వారిని కిస్ చేయడం ఒక ట్రెండ్‌గా ప్రేక్షకులు మార్చారు.

 Kissed Cam The Young Woman Who Got In The Way Of Her Boy Friend , Kiss Cam, Viral Latest, Benny Boyfriend,bull Costume,news Viral, Social Media, Viral, Boy Friend , Young Woman-TeluguStop.com

తమ వైపు కెమెరా తిరగగానే వారు వెంటనే పక్కనే ఉన్న తమ ఫ్రెండ్స్ లేదా లవర్స్‌ను ముద్దు పెట్టుకోవడం మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటాం.ఈ ట్రెండ్ ఎక్కువగా ఫారిన్ దేశాల్లో కొనసాగుతుంటుంది.

అయితే తాజాగా ఒక కిస్ క్యామ్ ఒక యువతి కొంపముంచింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 Kissed Cam The Young Woman Who Got In The Way Of Her Boy Friend , Kiss Cam, Viral Latest, Benny Boyfriend,Bull Costume,news Viral, Social Media, Viral, Boy Friend , Young Woman-కొంపముంచిన కిస్ క్యామ్.. బాయ్ ఫ్రెండ్‌కి అడ్డంగా దొరికిన ఆ యువతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైరల్ అవుతున్న వీడియోలో కిస్ క్యామ్ ప్రారంభం కాగానే ఇద్దరు మధ్యవయస్కులు ముద్దు పెట్టుకోవడం చూడొచ్చు.ఆ తర్వాత ఇద్దరు వృద్ధులు చుంబనం ఇచ్చుకోవడం కూడా గమనించవచ్చు.

ఆ తర్వాత కెమెరా ఇద్దరు మస్కట్ల వైపు తిరిగింది.ఈ ఇద్దరు వ్యక్తులు ఎద్దు కాస్ట్యూమ్ ధరించి కనిపించారు.

అయితే కెమెరా తనవైపు తిరిగిందని బెన్నీ అనే ఒక యువతి ఏమి ఆలోచించకుండా తన పక్కనే ఉన్న యువకుడికి కిస్ ఇచ్చింది.వీరిద్దరూ ఎద్దు లాంటి వేషం ధరించడంతో అది నిజంగా కిస్ ఇచ్చినట్టు అవ్వలేదు.

కానీ ఈ దృశ్యాన్ని బెన్నీ బాయ్‌ఫ్రెండ్ చూశాడు.ఆ సమయంలో అతడు పాప్‌ కార్న్ తీసుకురావడానికి బయటికి వెళ్లాడు.అయితే పాప్‌ కార్న్ తీసుకొని తిరిగి స్టేడియంలోకి అడుగు పెట్టగానే బెన్నీ మరొక వ్యక్తికి ముద్దు పెడుతూ కనిపించింది.దీంతో ఆగ్రహానికి గురైన బెన్నీ బాయ్ ఫ్రెండ్ పాప్‌ కార్న్ మొత్తం కింద పడేశాడు.

అనంతరం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు.అయితే నచ్చచెప్పడానికి అతని వెంటే బెన్నీ కూడా వెళ్ళిపోయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఇలా చేయడం ఏమీ బాగోలేదు అని కొందరు కామెంట్ చేశారు.

ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా వీక్షించండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube