టాలీవుడ్ దర్శకులకి వెంటనే కావాలి... ఊర్వశి రౌటేల ఆసక్తికర వ్యాఖ్యలు

చాలా మంది నార్త్ ఇండియన్ అందాల భామలు ఒకప్పుడు తెలుగులో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.నటించాల్సి వచ్చిన భారీగారెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారు.

 Urvasi Routela Said Tollywood Directors Tuff Task Masters, Tollywood, Telugu Cin-TeluguStop.com

కెరియర్ ఆరంభంలోనే కత్రినాకైఫ్ తెలుగులో నటించడానికి రెండు కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.అయితే తెలుగు దర్శక, నిర్మాతలకి మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.

వాళ్ళు అయితే గ్లామర్ పెర్ఫార్మెన్స్ విషయంలో సౌత్ భామల కంటే మంచి కోపరేటివ్ గా ఉంటారని, కాస్ట్యూమ్స్ విషయంలో అస్సలు అభ్యంతరం చెప్పారని అభిప్రాయం ఉంది.దీంతో బాలీవుడ్ భామలకి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు.

అయితే బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరగడంతో పాటు, తెలుగు సినిమాలలో నటిస్తే గౌరవంగా చూడటం మొదలు పెట్టారు.దీంతో బాలీవుడ్ భామలు తెలుగు సినిమాలలో కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు.

అయితే మన దర్శకులు టెస్ట్ వేరేగా ఉంటుంది, అక్కడి దర్శకులు హీరోయిన్స్ ని ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది.మన దర్శకులు అందాన్ని కెమెరాలో బంధించడం ఒక ఆర్ట్ గా భావిస్తారు.

అయితే ఆ విషయంలో చాలా మంది హీరోయిన్స్ తెలుగు చిత్రపరిశ్రమ మీద గతంలో విమర్శలు కూడా చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు బ్లాక్ రోజ్ అనే తెలుగులో సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా దక్షిణాదిలో సినిమాలు చేయడంపై ఆసక్తికర వాఖ్యలు చేసింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి దక్షిణాదిని ఒణికిస్తున్న ఈ సమయంలో టాలీవుడ్ అరంగేట్రం చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.వారు చాలా టఫ్ టాస్క్ మాస్టర్స్.

వారికి ఏ పని అయినా వెంటనే అయిపోవాలని అంటారని సరదాగా కామెంట్ చేసింది.ఆమె మాటలలో దక్షిణాది దర్శకులు ఎక్కువగా పని చేయించుకుంటారని అభిప్రాయం ఉన్నట్లు స్పష్టమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube