పప్పులలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు

తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉన్న పప్పులు శాఖాహారులకు చాలా బాగా సహాయపడతాయి.పప్పులను భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు రకరకాలుగా వంటల్లో ఉపయోగిస్తారు.

 Health Benefits Of Pulses-TeluguStop.com

వీటిల్లో పీచు, ప్రోటీన్స్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు.అంతేకాక నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉండటం వలన రక్తంలో చక్కెర వెంటనే విడుదల కాదు.అటువంటి పప్పులతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1.కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది


పప్పులలో కరిగే ఫైబర్ అధిక స్థాయిలో ఉండుట వలన రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటానికి సహాయపడుతుంది.కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మరియు ధమనులను శుభ్రంగా ఉంచడం ద్వారా గుండె వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2.గుండె ఆరోగ్యం


అనేక అధ్యయనాలలో అధిక ఫైబర్ ఉన్న పప్పుల వంటి ఆహారాలను తీసుకుంటే గుండె వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిసింది.

పప్పులలో ఫోలేట్ మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఫోలేట్ హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించి ప్రమాదకరమైన గుండె వ్యాధిని తగ్గిస్తుంది.మెగ్నీషియం రక్త ప్రవాహం, ఆక్సిజన్ మరియు పోషకాలు శరీరం అంతటా విస్తరించేలా సహాయపడుతుంది.కాబట్టి పప్పులను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3.జీర్ణ సంబంధ ఆరోగ్యం


పప్పులలో కరగని పీచు పదార్థం ఉండుట వలన మలబద్ధకం మరియు చికాకు పరిచే ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ లోపాలను నిరోధించడానికి సహాయపడుతుంది

4.బ్లడ్ షుగర్ స్థిరత్వం


ఫైబర్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.కరిగే ఫైబర్ పిండిపదార్ధాలను తగ్గించి, జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా ప్రోత్సహించి తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.మధుమేహం, ఇన్సులిన్ నిరోధకశక్తి లేదా హైపోగ్లేసిమియా ఉన్నవారిలో మాత్రమే సహాయపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు