దేశంలో కరోనా తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టక ముందే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విరమించిన విషయం తెలిసిందే.కాగా అక్కడక్కడ కేసులు కూడా నమోదు అవుతున్నాయి.
అందులో రానున్న రెండు నెలల్లో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య సంస్ద హెచ్చరిస్తున్న క్రమంలో వారి మాటలు పెడచెవిన పెట్టిన కొన్ని రాష్ట్రాలు ముంచుకొస్తున్న ముప్పును గ్రహించే స్దితిలో లేవు.
కానీ జార్ఖండ్ ప్రభుత్వం కరోనా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడప్పుడే లాక్‌డౌన్ విరమించేది లేదని అందువల్ల జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.ఇకపోతే ఇప్పటి వరకు జార్ఖండ్ ప్రభుత్వం ఏడు సార్లు లాక్ డౌన్ ను పొడిగించింది.
చూసారా ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని బాహటంగానే జార్ఖండ్ ప్రభుత్వం చెబుతుంది.అంతే కదా మళ్లీ కరోనా మూడో వేవ్ తెప్పించుకుని బాధపడే బదులు ముందు జాగ్రత్త పడటం మేలు అని గ్రహించింది కావచ్చూ ఈ రాష్ట్ర ప్రభుత్వం.