హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో సభ రద్దు కావడంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.ఆందోళన చేస్తున్న నిరసనకారులను, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.
దీంతో టెన్షన్ నెలకొంది.అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.







