స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా వున్న ‘‘ఎమర్జెన్సీ’’( Emergency ) విషయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి( Indira Gandhi ) మద్ధతు ఇచ్చినందుకు తన తాత అమర్‌నాథ్ విద్యాలంకర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా( Ro Khanna ) స్పందించారు.ఈ విషయంలో తన తాతకు ఆయన మద్ధతుగా నిలిచారు.
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసిన నేపథ్యంలో రో ఖన్నా స్పందించారు.
ఈ నిర్ణయం గాంధేయవాదానికి ద్రోహంగా ఆయన అభివర్ణించారు.
తన తాత జైలులో ఏళ్ల పాటు మగ్గిపోయి త్యాగం చేసింది ఇందుకోసం కాదన్నారు.రాహుల్ గాంధీకి మద్ధతుగా రో ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు ఆయన తాత , గాంధేయవాది అయిన అమర్‌నాథ్ విద్యాలంకర్( Amarnath Vidyalankar ) ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి మద్ధతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఎమర్జెన్సీ సమయంలో అమర్‌నాథ్ .ఇందిరా గాంధీ ప్రభుత్వంలో భాగమయ్యారని రో మరిచిపోయారని ,

ఆ సమయంలో భారత సమాజంపై జరిగిన దౌర్జన్యాలను విద్యాలంకర్ వ్యతిరేకించలేదని నెటిజన్లు భగ్గుమన్నారు.దీనిపై స్పందించిన రో ఖన్నా ట్వీట్ చేశారు.లాలా లజపతిరాజ్ కోసం పనిచేయడంతో పాటు ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన తన తాతగారిపై దుష్ప్రచారం చేయడం విచారకరమన్నారు.
ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తాన తాత ఇందిరా గాంధీకి రెండు లేఖలు రాయడమే కాకుండా.పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారని తెలిపారు.‘‘ కావాలంటే తనపై దాడి చేయాలని.భారత స్వాతంత్ర్య సమరయోధులపై దాడి చేయొద్దని’’ ఇందిరా గాంధీని కోరారని రో ఖన్నా గుర్తుచేశారు.

ఇకపోతే.అమర్‌నాథ్ విద్యాలంకర్‌ను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో గొప్పగా కీర్తించింది.అవిభక్త పంజాబ్ (ప్రస్తుత పాకిస్తాన్)లో పుట్టిన విద్యాలంకర్ సామాజిక కార్యకర్త అని, స్వాతంత్ర్య సమరయోధుడని ప్రశంసించింది.ఆర్య సమాజ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం.గాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో దిగి, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.







