టాలీవుడ్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ బ్యూటీ హిమజ( Himaja ) ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తొలిసారిగా బుల్లితెరపైప్రసారమైన సీరియల్ లో తన నటన ను పరిచయం చేసింది హిమజ.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు నటన పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.బుల్లితెరపై ఈమె భార్యమణి, స్వయంవరం( Bharyamani ), కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి దారావాహిక సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత వెండి తెరపై అడుగు పెట్టి కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేసింది.ఇక వెండితెరపై కూడా తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది హిమజ.
వచ్చిన అవకాశాలను కాదనకుండా ఓకే చెప్పేస్తుంది.
పలు అడ్వర్టైజ్మెంట్లలో కూడా చేసింది.
ఇక సోషల్ మీడియాలో( Social media ) బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక షేర్ల తో బిజీగా ఉంటుంది హిమజ.
ఇక ఈమె గతంలో.స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని బాగా సందడి చేసింది.
హౌస్ లో ఉన్నంతకాలం తోటి కంటెస్టెంట్లతో బాగా సరదాగా ఉండేది.తన ఆట తీరుతో కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అలా బిగ్ బాస్ తర్వాత ఫాలోయింగ్ అనేది పెంచుకుంది.ఇక హిమజ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది.ఈమె ఎప్పుడూ గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.ఈమె వేసుకున్న బట్టలు కూడా అందాలను కవర్ చేస్తూ ఉంటాయి.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అందర్నీ ఫిదా చేస్తూ ఉంటుంది.

యూట్యూబ్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకొని.అందులో కూడా మంచి మంచి వీడియోలు పంచుకుంటూ ఉంటుంది.తనకు ఖాళీ సమయం దొరికితే ఇన్ స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.
వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది.అప్పుడప్పుడు లైవ్ కాల్స్ ద్వారా కూడా బాగా సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఇన్ స్టా లో కొన్ని కొన్ని సార్లు ఫన్నీ వీడియోస్ చేస్తూ బాగా ఆటపట్టిస్తూ ఉంటుంది.ఇక ఈమె ఈమధ్య పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు కొన్ని బ్రాండ్ లకు ప్రమోషన్ కూడా చేస్తుంది.ఇప్పటికే కొన్ని నిత్యవసరాలను ప్రమోట్ చేయగా.తాజాగా మరో బ్రాండ్ కు ప్రమోట్ చేసినట్లు కనిపించింది.తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో ఎలక్ట్రిక్ బైక్స్ గురించి ప్రమోట్ చేసింది.
దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇక ఈమె వరుస ప్రమోషన్లను చూసి ఇక ఎప్పుడూ ఇదే పనినా.సినిమాల్లో నటించే హోప్స్ లేవా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఓ నెటిజన్.నీ రీల్స్చూడటమే ఎక్కువ.
మళ్లీ అందులో ఈ ప్రమోషన్స్ ఒకటి అంటూ ట్రోల్ చేశారు.చాలావరకు ఈమె వివిధ బ్రాండ్లకు ప్రమోట్ చేయడం వల్ల చూసేవాళ్లంతా విసుగు చెందుతున్నారు.







