Sreeleela : అలాంటి అబ్బాయే కావాలి.. బ్రెయిన్ తో చేసే పనులు నేను చూసుకుంటా.. శ్రీలీల కామెంట్స్ వైరల్!

శ్రీలీల( Sreeleela ) ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.ఈ ముద్దుగుమ్మ నటించినది కేవలం కొన్నిసార్లు సినిమాలే అయినప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం మామూలుగా లేదు.

 Sreeleela Cute Original Interview With Soumya Promo Released-TeluguStop.com

అతి తక్కువ సమయంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భగవంత కేసరి( Bhagavanth Kesari ) సినిమాలో బాలయ్య బాబు కూతురి పాత్రలో నటించింది.

Telugu Balakrishna, Guntur Kaaram, Promo, Sreeleela-Movie

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా( Guntur Kaaram )లో మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటించింది.ఇలా హీరోయిన్ గా సినిమాలలో నటిస్తూనే మరోవైపు డాక్టర్ చదువును కొనసాగిస్తోంది ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఒరిజినల్ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రాంని మొదలుపెట్టింది.

ఈ ఇంటర్వ్యూలను సౌమ్య హోస్ట్ చేస్తుండగా పలువురు సెలబ్రిటీలు వస్తున్నారు.

Telugu Balakrishna, Guntur Kaaram, Promo, Sreeleela-Movie

ఈ ఒరిజినల్ ఇంటర్వ్యూకి మొదటి ఎపిసోడ్ కి శ్రీలీల వచ్చింది. ఇంటర్వ్యూలో క్యూట్, ఫన్నీ ప్రశ్నలు అడిగారు.ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ప్రోమో అంతా ఫుల్ ఫన్నీగా సాగింది.ఇందులో సౌమ్య.

మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా, ఫన్నీ, జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా అని అడిగితే శ్రీలీల.ఫన్నీ, జోవియల్ అబ్బాయే కావాలి, బ్రెయిన్ తో చేసే పనులు నేను చూసుకుంటాను అని చెప్పింది.

ఇండైరెక్ట్ గా బ్రెయిన్ లేని అబ్బాయి అయిన పర్లేదు, నవ్వించే అబ్బాయి కావాలంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది శ్రీ లీలా.ఈ సందర్బంగా శ్రీ లీలా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube