టాలీవుడ్ నంబర్ 1 స్టార్ హీరో ఇతనే.. రెండో స్థానంలో ఏ హీరో ఉన్నారంటే?

ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలా సర్వే నిర్వహించి ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే.ఈ సంస్థ నిర్వహించిన ఏప్రిల్ నెల సర్వేలో టాలీవుడ్ నంబర్ 1 స్టార్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలవడం గమనార్హం.

 Tollywood Number 1 Star Hero Ormax Media Survey Details, Ormax Media, Tollywood-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడటం వల్లే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో నంబర్ 1 స్థానంలో నిలిచారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ జాబితాలో తారక్ తొలిస్థానంలో నిలిస్తే రెండో స్థానంలో స్టార్ హీరో ప్రభాస్ ఉన్నారు.

ఈ ఏడాది రాధేశ్యామ్ సినిమాతో పలకరించిన ప్రభాస్ ఆ సినిమా సక్సెస్ సాధించకపోయినా రెండో స్థానంలో నిలిచి ఆకట్టుకున్నారు.ఐకాన్ స్టార్ గా ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా ద్వారా సక్సెస్ సాధించి మూడో స్థానంలో నిలవడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ లో మరో హీరోగా నటించిన రామ్ చరణ్ నాలుగో స్థానంలో నిలిచారు.

సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు ఐదో స్థానంలో నిలవగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో ఉన్నారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Ntr, Massmaharaj, Nani, Number, Ormax Survery, P

మరికొన్ని రోజుల్లో అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న నాని ఏడో స్థానంలో నిలవడం గమనార్హం.ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను విడుదల చేస్తూ న్యాచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Ntr, Massmaharaj, Nani, Number, Ormax Survery, P

ఈ ఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో ఉన్నారు.చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉండగా మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో పదో స్థానంలో నిలవడం గమనార్హం.ప్రస్తుతం ఈ జాబితా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube